రాజీ మార్గంతోనే కేసుల పరిష్కారం
జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయిరమాదేవి
సిద్దిపేటకమాన్: రాజీ మార్గంతోనే కేసులు పరిష్కరించుకునేలా కృషి చేయాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్‌పర్సన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయిరమాదేవి అన్నారు. మార్చి 8న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌ను పురస్కరించుకుని సిద్దిపేట కోర్టు ఆవరణలో పోలీసు, ఎకై ్సజ్ శాఖల అధికారులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ రాజీపడదగిన కేసులు పరిష్కరించుకునేలా కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు స్వాతిరెడ్డి, పోలీసు అధికారులు పాల్గొన్నారు.
ప్రజల విశ్వాసాన్ని
కోల్పోయిన కాంగ్రెస్
ఎంపీ రఘునందన్ రావు
సిద్దిపేటజోన్: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 14 నెలల్లోనే ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం స్థానిక కొండ భూదేవి గార్డెన్‌లో నిర్వహించిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. ఎమ్మెల్సీగా గెలిచిన వారు ప్రజా గొంతుకగా ఉండాలన్నారు. అంతకుముందు పట్టభద్రుల ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి మాట్లాడారు. సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు శంకర్, నాయకులు మోహన్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తక్కువ పెట్టుబడితో
అధిక దిగుబడి
వ్యవసాయ శాఖ అధికారి రాధిక
సిద్దిపేటజోన్: నానో యూరియా, డీఏపీ వినియోగించడం ద్వారా తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి పొందే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ జిల్లా అధికారి రాధిక అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలో నానో యూరియా, డీఏపీలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎరువులు అధికంగా వాడటం వల్ల భూసారం దెబ్బ తింటుందన్నారు. అలాగే అనేక అనారోగ్యాలకు కారణంగా మారుతుందన్నారు. నానో యూరియా. డీఏపీలను పిచికారీ చేయడం వల్ల మేలు జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా రైతులు జీడిపల్లి రాంరెడ్డి, అశోక్ రెడ్డి, ఎల్లాగౌడ్, రంగయ్యలను సన్మానించారు. కార్యక్రమంలో మార్క్ ఫెడ్ జిల్లా అధికారి క్రాంతి, మండల వ్యవసాయ అధికారి శ్రీనాథ్, రైతులు పాల్గొన్నారు.
మల్లన్న పెద్ద పట్నానికి
పటిష్ట బందోబస్తు
కొమురవెల్లి(సిద్దిపేట): మల్లికార్జున స్వామి ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా నిర్వహించే పెద్దపట్నానికి పట్టిష్ట బందోబస్తు చేపట్టినట్లు సీపీ అనురాధ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వేలాదిగా తరలి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు చేపట్టామన్నారు. కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పార్కింగ్ ప్రదేశాలతో పాటు ఆలయ ఆవరణలో 80 సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశామన్నారు.
బీజేపీ పాలనలో
దేశం అధోగతి
ఏఐసీసీ కార్యదర్శి విష్ణునాథ్
దుబ్బాక: దేశాన్ని అన్ని రంగాల్లో బీజేపీ ప్రభుత్వం సర్వనాశనం చేస్తోందని ఏఐసీసీ కార్యదర్శి విష్ణునాథ్ అన్నారు. మంగళవారం కాంగ్రెస్ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, నియోజకవర్గం ఇన్‌చార్జి చెరుకు శ్రీనివాస్‌రెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. అన్ని వర్గాల ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే న్యాయం జరుగుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన సంవత్సరంలోని 6 పథకాలు అమలు చేశామన్నారు. ఏడాదిలోనే 56 వేల మందికి ఉద్యోగాలు అందించామన్నారు. ఎవరెన్ని ప్రలోభాలకు గురిచేసినా లొంగకుండా కాంగ్రెస్ బలపర్చిన నరేందర్‌రెడ్డిని మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు.
రాజీ మార్గంతోనే కేసుల పరిష్కారం
Comments
Please login to add a commentAdd a comment