రహదారి పనులు వేగిరం చేయండి
ఏకరూప దుస్తులకు చర్యలు చేపట్టండి
● కలెక్టర్ మనుచౌదరి
● నేషనల్ హైవే అఽథారిటీ అధికారులకు దిశానిర్దేశం
హుస్నాబాద్: మెదక్–ఎల్కతుర్తి జాతీయ రహదారి పనులను త్వరగా పూర్తి చేయాలని నేషనల్ హైవే అఽథారిటీ అధికారులను కలెక్టర్ మనుచౌదరి ఆదేశించారు. హుస్నాబాద్ పట్టణం మీదుగా నిర్మిస్తున్న రహదారి, ఇరువైపులా నిర్మిస్తున్న డ్రైనేజీ పనులను మంగళవారం కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జాతీయ రహదారి వెంబడి నిర్మిస్తున్న తాగునీటి పైపు లైన్ పనులను పది రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం ప్రభుత్వ మెడికల్ కళాశాల ఏర్పాటుకు, మహిళా శక్తి భవనం నిర్మాణానికి జిల్లెల్లగడ్డ, ఉమ్మాపూర్‌లలో స్థలాలను పరిశీలించారు. రెవెన్యూ అధికారులు ప్రభుత్వ స్ధలాలను చూపించి వివరాలను కలెక్టర్‌కు అందించారు. కార్యక్రమంలో ఆర్డీఓ రామ్మూర్తి, తహసీల్దార్ రవీందర్ రెడ్డి ఉన్నారు.
నాణ్యమైన భోజనం అందించాలి
నంగునూరు(సిద్దిపేట): విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందజేసి, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని కలెక్టర్ వార్డెన్లను ఆదేశించారు. మంగళవారం పాలమాకుల ఎస్సీ హాస్టల్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కాంట్రాక్టర్ నాణ్యమైన సరుకులు అందజేయకుంటే అధికారులకు ఫిర్యాదు చేయాలన్నారు. హాస్టల్ భవనం పెచ్చులూడుతున్నందున మరమ్మతులకు ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు. ఆయన వెంట ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారి హమీద్ తహసీల్దార్, ఆర్‌ఐ తదితరులు ఉన్నారు.
సిద్దిపేటరూరల్: వచ్చే విద్యా సంవత్సరానికి ప్రభుత్వ పాఠశాల, గురుకులాల్లో చదువుకుంటున్న విద్యార్థులకు యూనిఫాంలను అందించేందుకు చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో విద్యా శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. గరిమా అగర్వాల్ మాట్లాడుతూ యూనిఫాంలు అందించేలా అన్ని శాఖలు సమన్వయంతో ముందుకు సాగాలన్నారు. యూనిఫాం తయారీలో ఇష్టానుసారంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకోవాలని డీఆర్‌డీఓ అధికారులకు సూచించారు.
మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి
దౌల్తాబాద్ (దుబ్బాక): పాఠశాలలోని విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించడంలో ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ తెలిపారు. శేరిపల్లి బందారంలోని జ్యోతిబాపూలే బాలికల గురుకుల పాఠశాలను, కళాశాలను సందర్శించారు. అనంతరం పదో తరగతి, ఇంటర్ విద్యార్థులతో మాట్లాడారు. వార్షిక పరీక్షలను దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ పరీక్షలకు సన్నద్ధం కావాలని, ఉత్తమ ఫలితాలను సాధించాలని సూచించారు.
అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్
విద్యాశాఖ అధికారులతో సమావేశం
రహదారి పనులు వేగిరం చేయండి
Comments
Please login to add a commentAdd a comment