భవిష్యత్తుకు క్రమశిక్షణే తొలి మెట్టు
గజ్వేల్‌రూరల్: ప్రతి విద్యార్థి ఉజ్వల భవిష్యత్తుకు క్రమ శిక్షణే తొలి మెట్టుగా నిలుస్తుందని డీఐఈఓ రవీందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం గజ్వేల్‌లోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో నిర్వహించిన ఫేర్‌వెల్ పార్టీలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించినప్పుడే భవిష్యత్తులో ఉన్నత స్థానాలను చేరుకుంటారన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ జ్యోతిర్మయి తదితరులు పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులు నిర్వహించిన పలు సాంస్క ృతిక కార్యక్రమాలు అలరించాయి. మండల పరిధిలోని ముట్రాజ్‌పల్లి మోడల్ స్కూల్‌లో మంగళవారం స్కూల్ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు.
ఉత్తమ ఫలితాలు సాధించాలి
కోహెడ(హుస్నాబాద్): విద్యార్థులు కష్టపడి చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని డీఐఈఓ రవీందర్‌రెడ్డి సూచించారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల వార్షికోత్సవానికి హాజరై మాట్లాడారు. వార్షిక పరీక్షల నేపథ్యంలో విద్యార్థుల ప్రిపరేషన్‌పై దిశానిర్దేశం చేశారు. వార్షికోత్సవం వేళ విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. కార్యక్రమంలో యాదగిరి, రాజమౌళి, అశోక్, రజిత, నీరజ, సీతారామయ్య, నరేష్, వెంకటరెడ్డి, పాల్గొన్నారు.
విద్యార్థులు అన్ని రంగాల్లోనూరాణించాలి
డీఐఈఓ రవీందర్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment