నేడే ‘మహా’ ఉత్సవం.. అంతా సిద్ధం
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): మహా శివరాత్రి ఉత్సవాలు బుధవారం ఘనంగా నిర్వహించేందుకు జిల్లాలోని శైవక్షేత్రాలు ముస్తాబయ్యాయి. ఆలయాలన్నీ విద్యుద్దీపాలతో అలంకరించారు. శైవభక్తులకు అతి ముఖ్యమైన పండుగ శివరాత్రి. జిల్లా కేంద్రంలోని ఉమాపార్థీవకోటిలింగాల ఆలయంతోపాటు అన్ని దేవాలయాలలో ఉత్సవాలకు భారీ ఏర్పాట్లు సిద్ధం చేశారు. అభిషేక ప్రియుడు శివుడికి పంచామృతాలతో అభిషేకం చేసేందుకు భక్తులు సిద్ధమయ్యారు. భక్తులకు ఎటువంటి అంతరాయం కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు.
పెరిగిన పండ్ల ధరలు
శివరాత్రి పర్వదినం వేళ పండ్ల ధరలకు రెక్కలొచ్చాయి. భక్తులు రోజంతా ఉపవాసం ఉంటారు. కేవలం పండ్లు మాత్రమే తీసుకుంటారు. గత ఏడాది కంటే ఈసారి ధరలు అధికంగా పెరిగాయి. అరటి పండ్లు డజన్(12) రూ. 60, దానిమ్మ కిలో రూ.200, ఆపిల్ కిలో రూ.220, కమల (సంత్ర) రూ.100, ద్రాక్ష రూ.100, ఖర్జూర కిలో రూ.250, వాటర్‌మిలాన్ రూ.50 చొప్పున విక్రయిస్తున్నారు.
ముస్తాబైన శైవక్షేత్రాలు
శివనామస్మరణతో మారుమోగనున్న ఆలయాలు
Comments
Please login to add a commentAdd a comment