
కోరమీసాల మల్లన్నకు కోటి దండాలు
శివ
నామస్మరణతో మార్మోగిన
కొమురవెల్లి
కోరమీసాల మల్లన్న స్వామీ.. కోటిదండాలు అంటూ భక్తులు ప్రణమిల్లారు. బుధవారం మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని కొమురవెల్లి మల్లన్న స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. పరమశివుడి ప్రతి రూపమైన మల్లికార్జున స్వామిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలి వచ్చారు. మల్లన్న నామస్మరణతో ఆలయ పరిసరాలన్నీ మారుమోగాయి. ఉపవాస దీక్షలతో జాగరణ చేసేందుకు భక్తులు స్వామివారి సన్నిధికి చేరుకున్నారు. మరోవైపు బ్రహ్మోత్సవాల్లో భాగంగా మహాశివరాత్రి లింగోద్భవ వేళ ఒగ్గుపూజారులు పెద్ద పట్నం వైభవంగా నిర్వహించారు. రాత్రంతా కనులపండువగా కార్యక్రమం చేపట్టారు. పెద్దపట్నంతో ఆలయ పరిసరాలు కోలాహలంగా మారాయి. రాజగోపురం నుంచి ప్రధాన రహదారి, గంగరేణి చెట్టు వద్ద సందడి నెలకొంది. భక్తులు స్వామి వారిని దర్శించుకున్న అనంతరం రేణుక ఎల్లమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. ఈఓ రామాంజనేయులు, ధర్మకర్తల మండలి సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. హుస్నాబాద్ ఏసీపీ సతీష్ ఆధ్వర్యంలో బందోబస్తు చేపట్టారు. – కొమురవెల్లి(సిద్దిపేట)

కోరమీసాల మల్లన్నకు కోటి దండాలు
Comments
Please login to add a commentAdd a comment