
ఓటెత్తాలి
ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రులు, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ స్థానాలకు గురువారం ఉదయం 8 నుంచి సాయంత్రం 4గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఇందు కోసం జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. సిద్దిపేట పట్టణంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఎన్నికల సిబ్బందికి సామగ్రిని అందజేశారు. ఈ సందర్బంగా కలెక్టర్ మనుచౌదరి పర్యవేక్షించారు.
సాక్షి, సిద్దిపేట: పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి 56 మంది, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కోసం 15 మంది బరిలో ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా పట్టభద్రుల ఓటర్లు 32,589, ఉపాధ్యాయ ఓటర్లు 3,212 మంది ఉన్నారు. పట్టభద్రుల కోసం 40 పోలింగ్ కేంద్రాలు, ఉపాధ్యాయుల కోసం 23 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అలాగే నల్గొండ, వరంగల్, ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానం పరిధిలోని పాత వరంగల్ జిల్లాకు చెందిన చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, దూళ్మిట్ట మండలాలు రానున్నాయి. వీటిలో 166 మంది ఉపాధ్యాయ ఓటర్లుండగా 4 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
327 మంది నియామకం
పోలింగ్ నిర్వహణకు మొత్తంగా 327 మంది సిబ్బందిని నియమించారు. అందులో ప్రిసైడింగ్ అధికారులు 87, అసిస్టెంట్ ప్రిసైడింగ్ 204, మైక్రో అబ్జర్వర్లు 36 మందిని నియమించారు. ఇందులో 20శాతం సిబ్బందిని రిజర్వ్‌లో పెట్టారు. ప్రత్యేక బస్సుల ద్వారా పోలింగ్ సిబ్బంది ఆయా పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు.
నేడే ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్
జిల్లాలో పకడ్బందీ ఏర్పాట్లు
ఓటు హక్కు వినియోగించుకోనున్న పట్టభద్రులు, ఉపాధ్యాయులు
పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న సిబ్బంది

ఓటెత్తాలి
Comments
Please login to add a commentAdd a comment