
ఉద్యమకారుల హామీలు అమలు చేయాలి
పోస్టుకార్డుల ద్వారా సీఎంకు వినతి
హుస్నాబాద్: తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం పోస్టుకార్డుల ద్వారా సీఎం రేవంత్ రెడ్డికి విన్నవించారు. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చీమ శ్రీనివాస్ పిలుపు మేరకు సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు, తెలంగాణ ఉద్యమకారుడు గడిపె మల్లేశ్ ఆధ్వర్యంలో సీఎం పోస్ట్‌కార్డు ఉద్యమం ప్రారంభించారు. ఈ సందర్భంగా మల్లేశ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా 250 గజాల ఇంటి స్ధలంతో పాటు ప్రతి నెల రూ.25వేల పెన్షన్, ఆర్టీసీ బస్సు, రైలులో ఉచిత ప్రయాణం కల్పించాలన్నారు. ప్రతి ఉద్యమకారుడిని ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధకులుగా గుర్తించి రూ.10వేల కోట్లతో ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలన్నారు. హైదరాబాద్‌లో ఐదెకరాల విస్తీర్ణంలో సంక్షేమ భవనం నిర్మించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉద్యమకారుల ఫోరం నియోజకవర్గ కన్వీనర్ మాదాసు శ్రీనివాస్, నాయకులు అయిలేని సంజీవరెడ్డి, అంకుషా వలీ, సదానందం, జగదీశ్వరాచారి, భాగ్యలక్ష్మి తదితరులు ఉన్నారు.
చర్చి ప్రెసిబెటరీ ఇన్‌చార్జి రాబిన్‌సన్ కన్నుమూత
మెదక్‌జోన్: మెదక్ సీఎస్‌ఐ చర్చి ప్రెసిబెటరీ ఇన్‌చార్జి రాబిన్‌సన్ కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మెదక్ పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తుదిశ్వాస విడిచారు. 2010 నుంచి 2019 వరకు చర్చి ప్రెసిబెటరీ ఇన్‌చార్జిగా బాధ్యతలు నిర్వర్తించారు. అంతకు ముందు చర్చి అధ్యక్ష మండలంలో వైస్ చైర్మన్‌గా, మినిస్ట్రీయల్ కన్వీనర్‌గా పనిచేశారు.

ఉద్యమకారుల హామీలు అమలు చేయాలి
Comments
Please login to add a commentAdd a comment