● ఆలయాలకు పోటెత్తిన భక్తజనం
● ఘనంగా శివపార్వతుల కల్యాణాలు
హర హర మహాదేవ.. అంటూ భక్తులు ముక్కంటి సేవలో తరించారు. పంచామృతాలతో అభిషేకాలు చేశారు. మారేడు పత్రితో పూజించారు. మహాశివరాత్రి వేడుకలు బుధవారం జిల్లా వ్యాప్తంగా అత్యంత వైభవంగా భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం నుంచే ఆలయాల వద్దకు భక్తులు బారులు తీరారు. జిల్లా కేంద్రంలోని ఉమాపార్థీశ్వర కోటిలింగాల, శరభేశ్వర, భోగేశ్వర, మార్కండేయ తదితర ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. శైవక్షేత్రాలలో ఆదిదేవుడికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. పర్వదినం పురస్కరించుకుని శివపార్వతుల కల్యాణాలను వైభవంగా నిర్వహించారు. దీంతో ఆలయాల పరిసరాలన్నీ శివనామస్మరణతో మారుమోగాయి.
– ప్రశాంత్‌నగర్(సిద్దిపేట)
Comments
Please login to add a commentAdd a comment