ఓటెత్తారు
మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు గురువారం ప్రశాంతంగా ముగిశాయి. గ్రాడ్యుయేట్స్ 72.83శాతం.. టీచర్స్ 94.83శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించారు. 32,589 మంది పట్టభద్రులకు 40 పోలింగ్ కేంద్రాలు, 3,212 మంది ఉపాధ్యాయ ఓటర్లకు 23 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 8 నుంచి సాయంత్రం 4గంటల వరకు పోలింగ్ జరిగింది. పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ మనుచౌదరి, సీపీ అనురాధ, ఎన్నికల పరిశీలకులు జ్యోతి బుద్ధి ప్రకాష్, అదనపు కలెక్టర్లు గరీమా అగర్వాల్, అబ్దుల్ హమీద్‌లు పోలింగ్ సరళిని పరిశీలించారు.
సాక్షి, సిద్దిపేట: ఉదయం పది గంటల వరకు నత్తనడకన సాగిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ మధ్యాహ్నం 2 గంటల తరువాత పుంజుకుంది. మధ్యాహ్నం 2గంటల వరకు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్ శాతం 49.59శాతం, పట్టభద్రుల పోలింగ్ 44.6శాతమే నమోదైంది. తర్వాత ఒక్కసారిగా ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వచ్చారు. ఉదయం నుంచి మధ్యాహ్నం 2గంటల వర కు ఎంత పోలింగ్ అయిందో సుమారుగా 2గంటల నుంచి 4గంటల వరకు అంత మంది ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు.
మూడు పోలింగ్ కేంద్రాలలో వంద శాతం..
జిల్లాలో గ్రాడ్యుయేట్‌కు 40, టీచర్స్‌కు 23 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అందులో టీచర్స్ కోసం కేటాయించిన మూడు పోలింగ్ కేంద్రాలు రాయపోలు జెడ్పీ హైస్కూల్ (256 పోలింగ్ కేంద్రం నంబర్), మర్కూక్ మండల పరిషత్ స్కూల్ (264), కుకునూరుపల్లి జెడ్పీహైస్కూల్(265)లలో వంద శాతం పోలింగ్ నమోదైంది.
93.97శాతం పోలింగ్
వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్స్ ఎమ్మెల్సీకి పూర్వపు వరంగల్ జిల్లా పరిధిలోని చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, దూళ్మిట్టలు రానున్నాయి. నాలుగు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా 166 మంది ఓటర్లకు గాను 156 (93.97 శాతం) మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
బ్యాలెట్ బాక్స్‌ల తరలింపు
పట్టభద్రుల, ఉపాధ్యాయల ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించిన బ్యాలెట్ బాక్స్‌లను కరీంనగర్‌లోని అంబేడ్కర్ స్టేడియానికి తరలించారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించిన బ్యాలెట్ బాక్స్‌లను నల్గొండకు తరలించారు.
ఓటింగ్ సరళి ఇలా..
ఎమ్మెల్సీ ఉ. 10గంటలు మధ్యాహ్నం 12 2గంటలు పోలింగ్ ముగిసేసరికి
ఉపాధ్యాయ 8.8శాతం 16.51 49.59 94.83
పట్టభద్రులు 8.2శాతం 15 44.6 72.83
ప్రశాంతంగా ఎమ్మెల్సీ పోలింగ్
పట్టభద్రులు 72.83..ఉపాధ్యాయులు 94.83శాతం నమోదు
ఎన్నికల సరళిని పరిశీలించిన కలెక్టర్, సీపీ
Comments
Please login to add a commentAdd a comment