ప్రాజెక్టుల బాధ్యత కిషన్‌రెడ్డిదే
హుస్నాబాద్: తెలంగాణకు ప్రాజెక్టులు తీసుకువచ్చే బాధ్యత కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిదేనని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గురువారం హుస్నాబాద్‌లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులు తీసుకురాకపోయినా కిషన్‌రెడ్డి బాధ్యత వహించాలన్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం పట్టించుకున్న పాపానపోలేదన్నారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల మద్య ఉన్న సంబంధాల దృష్ట్యా సీఎం, మంత్రులు, ఎంపీలు రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టుల గురించి బీజేపీ ప్రభుత్వాన్ని అడుగుతున్నామని తెలిపారు. ఇప్పటి వరకు మెట్రో మలిదశ, మూసీ, ట్రిపుల్ ఆర్, హైదరాబాద్ తాగునీటి సమస్య, ఉపాధి అవకాశాలు మెరుగుపడే అంశాలకు సంబంధించి అనేక ప్రాజెక్టులు కేంద్రానికి సమర్పించామన్నారు. మేము కాలికి బట్ట కట్టుకొని కేంద్రం చుట్టూ తిరుతున్నామన్నారు. ఇవి రాకపోతే మా బాధ్యత అంటూ బీజేపీ నేతలు మాట్లాడటం సిగ్గుచేటన్నారు. రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగా కేంద్ర మంత్రులు నిధులు తేవాల్సిందేనన్నారు. నిధులు తేకపోతే ఈ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని అసమర్థులుగా చూస్తారన్నారు. తెలంగాణ ప్రభుత్వంగా ప్రతి రూపాయి జీఎస్టీ పన్ను రూపంలో ఎక్కడా తేడా రానివ్వడం లేదన్నారు. పాకిస్తాన్, ఇండియా జట్టు అంటూ రెచ్చగొడుతున్నారన్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ ఓడిపోతే, పంటలు ఎండిపోతే ట్వీట్ చేసున్న కేటీఆర్ తీరును చూసి ప్రజలు నవ్వుతున్నారన్నారు.
నిధులు తేలేకపోతే అసమర్థ నాయకులే..
మంత్రి పొన్నం ప్రభాకర్
Comments
Please login to add a commentAdd a comment