ఫ్రీ చికెన్
దుబ్బాకటౌన్: పట్టణంలో గురువారం చికెన్, ఎగ్ మేళా నిర్వహించారు. చికెన్, గుడ్ల వినియోగంపై వస్తున్న అపోహలను పోగొట్టేందుకు వెన్‌కాబ్ చికెన్ ఆధ్వర్యంలో ఉచిత చికెన్, ఎగ్ మేళా నిర్వహించారు. సుమారు 2వేల ఉడకబెట్టిన కోడిగుడ్లు, 3వేల కిలోల చికెన్‌కర్రి, ఫ్రై జనాలకు పంపిణీ చేసి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వెన్‌కాబ్ మార్కెటింగ్ మేనేజర్ జయ రాంరెడ్డి, మార్కెటింగ్ డిస్ట్రిబ్యూటర్ స్వామి మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితుల్లో కోడి మాంసం, గుడ్లు బాగా ఉడికించి తినడం వల్ల ఎలాంటి అనారోగ్యం సంభవించదన్నారు. కనుక ఆపోహలు వీడాలన్నారు. చికెన్ మేళాలో జనాలు ఎగబడి ఆరగించడం విశేషం.
దుబ్బాకలో చికెన్ కోసం ఎగబడిన జనం
దుబ్బాకలో చికెన్, ఎగ్ మేళా
ఎగబడిన జనం
Comments
Please login to add a commentAdd a comment