మేధావుల మౌనం దేశానికి నష్టం
ఎంపీ రఘునందన్‌రావు
దుబ్బాక: మేధావుల మౌనం దేశానికి ప్రమాదకరమని మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్‌రావు అన్నారు. గురువారం అక్భర్‌పేట–భూంపల్లి మండల కేంద్రంలో తన సతీమణితో కలిసి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. దేశాభివృద్ధికి మేధావుల ఆలోచన విధానాలు చాలా అవసరమన్నారు. ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కు వినియోగించుకోవడం మనకు రాజ్యాంగం కల్పించిన హక్కు అన్నారు. ఉన్నత చదువులు అభ్యసించి రాజ్యాంగం పట్ల సంపూర్ణ అవగాహన కలిగి ఉన్న మేధావులు ఓటుకు దూరంగా ఉండడం ఎంత మాత్రం దేశానికి మంచిది కాదన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment