పుస్తక పఠనంతోనే బంగారు భవిష్యత్
అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): పుస్తక పఠనం ద్వారానే విద్యార్థులకు బంగారు భవిష్యత్ ఉంటుందని అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ అన్నారు. నేషనల్ బుక్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా మొబైల్ లైబ్రరీని గరిమా అగర్వాల్ శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాలలు పుస్తకాలు చదవాలన్నారు. పుస్తక పఠనంతో జ్ఞానంతో పాటుగా మానసిక ఆరోగ్యం లభిస్తుందన్నారు. సంచార పుస్తక ప్రదర్శనలు విద్యావంతులకు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. కార్యక్రమంలో ఎన్‌బీటీ రీజినల్ మేనేజర్ డాక్టర్ పత్తిపాక మోహన్, సెక్టోరియల్ ఆఫీసర్ భాస్కర్, మండల విద్యాధికారి రాజ ప్రభాకర్‌రెడ్డి, ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
సుందరీకరణ పనులు వేగిరం చేయండి
హుస్నాబాద్: పట్టణంలోని ఎల్లమ్మ చెరువు సుందరీకరణ పనులను శుక్రవారం అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్ పరిశీలించారు. పనుల ప్రగతిపై అడిగి తెలుసుకున్నారు. పర్యాటక శాఖ అధికారులు చెరువు సుందరీకరణ ఫొటోలను అదనపు కలెక్టర్‌కు చూపించారు. చిత్రాలను చూసి పనులు తొందరగా పూర్తి చేయాలని సంబంధిత కాంట్రాక్టర్, అధికారులను ఆమె ఆదేశించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్, సిబ్బంది పాల్గొన్నారు.
రాష్ట్రపతి నిలయంలో
సైన్స్ ఎగ్జిబిట్ల ప్రదర్శన
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా శుక్రవారం నగరంలోని రాష్ట్రపతి నిలయంలో జిల్లాకు చెందిన రెండు ఎగ్జిబిట్లను ప్రదర్శించినట్లు సైన్స్ అధికారి శ్రీనివాస్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 40 ప్రదర్శనలు ఎంపిక కాగా, ఇందులో 2 ప్రదర్శనలు సిద్దిపేట జిల్లావి ఉన్నాయన్నారు. దామరకుంట భౌతిక రసాయన శాస్త్ర ఉపాధ్యాయుడు చిన్న బ్రహ్మ య్య ఆధ్వర్యంలో టెన్త్ విద్యార్థి అశ్వంత్ రూపొందించిన ప్రాజెక్టుతో పాటుగా, లచ్చపేట ఉపాధ్యాయురాలు జ్యోతి పర్యవేక్షణలో 9వ తరగతి విద్యార్థి హర్ష వర్ధన్ రూపొందించిన రా కెట్ లాంచింగ్ విధానాన్ని ప్రదర్శించారని తెలిపారు.
సృజనాత్మకత
పెంపొందించుకోవాలి
జిల్లాలో జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో శుక్రవారం జాతీయ సైన్స్ దినోత్సవాన్ని నిర్వహించారు. పాఠశాలల్లో విద్యార్థులు వివిధ ప్రాజెక్టులను ప్రదర్శించారు. వీటిని ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు తిలకించారు. అనంతరం మంచి ప్రాజెక్టు రూపొందించిన విద్యార్థులకు బహుమతులు పంపిణీ చేశారు. జిల్లా కేంద్రంలోని కాకతీయ టెక్నో స్కూల్‌లో నిర్వహించిన సైన్స్ దినోత్సవంలో బీఎస్‌ఎంఏఆర్‌టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లారెడ్డి పాల్గొన్నారు. విద్యార్థులు శాసీ్త్రయ సృజనాత్మకతను పెంపొందించుకోవాలనిసూచించారు.
అవగాహన కల్పించండి
సిద్దిపేటకమాన్: లీగల్ అవేర్‌నెస్ కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ, న్యాయమూర్తి స్వాతిరెడ్డి అన్నారు. సిద్దిపేట కోర్టు భవనంలో న్యాయవాదులు, ప్యారా లీగల్ వలంటీర్స్‌తో శుక్రవారం న్యాయమూర్తి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పిల్లలు, మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న వారికి అవగాహన కల్పించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.
పుస్తక పఠనంతోనే బంగారు భవిష్యత్
పుస్తక పఠనంతోనే బంగారు భవిష్యత్
పుస్తక పఠనంతోనే బంగారు భవిష్యత్
Comments
Please login to add a commentAdd a comment