మండల వ్యవసాయ అధికారి సస్పెన్షన్
హుస్నాబాద్‌రూరల్: మండల వ్యవసాయ అధికారి నాగరాజు సస్పెండ్ అయ్యారు. ఈ మేరకు వ్యవసాయశాఖ కమిషనర్ గోపి శుక్రవారం ఉత్తర్వులు జారి చేసినట్లు ఏడీఏ శ్రీనివాస్ తెలిపారు. సీసీఐ కేంద్రాల్లో వ్యాపారులు పత్తి విక్రయించడానికి బోగస్ రైతుల పేరున ఏఈఓల సంతకాలు ఫోర్జరీ చేసి టీఆర్‌లను ఇచ్చినట్లు విచారణలో అధికారులు గుర్తించారు. మీర్జాపూర్, హుస్నాబాద్, మహ్మదాపూర్ క్లస్టర్ల పరిధిలో 18 మంది బోగస్ రైతులకు ధ్రువీకరణ పత్రాలు ఇవ్వడంతో వ్యాపారులు 946 క్వింటాళ్ల పత్తిని సీసీఐలో అమ్ముకున్నారు. ఫోర్జరీ సంతకాలను గుర్తించిన ఏఈఓలు జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు. జిల్లా వ్యవసాయ అధికారి, మార్కెటింగ్ అధికారి సంయుక్తంగా విచారణ చేసి కలెక్టర్‌కు నివేదికను అందించారు. విచారణ నివేదికను పరిశీలించి వ్యవసాయ కమిషనర్ గోపి సస్పెండ్ చేసినట్లు ఏడీఏ పేర్కొన్నారు.
చట్టాలపై
అవగాహన అవసరం
హుస్నాబాద్ కోర్టు జడ్జి కృష్ణతేజ్
హుస్నాబాద్: విద్యార్థులు చదువుతో పాటు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని హుస్నాబాద్ కోర్టు జడ్జి కృష్ణతేజ్ అన్నారు. మండలంలోని పొతారం(ఎస్) సోషల్ వెల్ఫేర్ బాలుర రెసిడెన్సియల్ హాస్టల్‌లో శుక్రవారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. అ సందర్భంగా కృష్ణతేజ్ మాట్లాడుతూ విద్యార్థులు చదువు పైనే దృష్టి పెట్టాలని, చెడు వ్యవసానాల వైపు వెళ్లొద్దని సూచించారు. నేషనల్ సైన్స్ డే పురస్కిరంచుకుని సీవీ రామన్ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం విద్యార్ధులు ప్రదర్శించిన ఎగ్జిబిట్లను పరిశీలించారు. కార్యక్రమంలో లీగల్ ప్యానెల్ అడ్వకేట్ కొంకట శ్రీనివాస్, పారా లీగల్ వలంటీర్ శ్రావణి, న్యాయవాదులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment