విధుల్లో అలసత్వం తగదు
● ఇంటర్ పరీక్షలు బాధ్యతగా చేపట్టాలి
● డీఐఈఓ రవీందర్‌రెడ్డి
సిద్దిపేటఎడ్యుకేషన్: ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షలు ప్రశాంతంగా, సజావుగా నిర్వహించేందుకు అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని డీఐఈఓ, పరీక్షల కమిటీ కన్వీనర్ రవీందర్‌రెడ్డి అన్నారు. పరీక్షల విధుల్లో పాల్గొననున్న చీఫ్‌సూపరింటెండెంట్ (సీఎస్), డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్ (డీఓ), కస్టోడియన్లు, స్క్వాడ్స్ సభ్యులకు శుక్రవారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విధుల్లో నిర్లక్ష్యాన్ని వీడాలన్నారు. పరీక్షల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పరీక్షా కేంద్రాల్లో అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ సమయపాలన పాటించాలని, అపరిచితులను ఎట్టి పరిస్థితుల్లో పరీక్షా కేంద్రాలకు అనుమతించకూడదని చెప్పారు. సమావేశానికి అబ్జర్వర్‌గా విచ్చేసిన ఇంటర్‌బోర్డు జాయింట్ సెక్రటరీ(అకౌంట్స్) భీమ్‌సింగ్ మాట్లాడుతూ ప్రత్యేకమైన శ్రద్ధతో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పరీక్షల నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ సత్యనారాయణరెడ్డి, ప్రశ్నాపత్రాల బల్క్ సెంటర్ ఇంచార్జి దేవస్వామి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment