మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌కు సన్మానం | - | Sakshi
Sakshi News home page

మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌కు సన్మానం

Published Mon, Mar 3 2025 7:06 AM | Last Updated on Mon, Mar 3 2025 7:06 AM

మార్క

మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌కు సన్మానం

హుస్నాబాద్‌రూరల్‌: హుస్నాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ మడప యాదవరెడ్డిని కూచనపెల్లి రెడ్డి సంఘం ఆధ్వర్యంలో ఆదివారం సన్మానించారు. ఈ సందర్భంగా రెడ్డి సంఘం అధ్యక్షుడు మంద సత్యనారాయరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ రైతులకు సేవచేసే అవకాశం కల్పించినందఅన్నారు. గ్రామాభి వృద్ధికి మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఆధ్వర్యంలో నిధులు తీసుకురావాలని కోరారు. రైతు సంక్షేమానికి ఉపయోగపడే పథకాలను అందించేందుకు కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో గాలిరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, రాంచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

పేద కుటుంబానికి సాయం

చిన్నకోడూరు(సిద్దిపేట): చిన్నకోడూరుకు చెంది న నిరుపేద రాళ్లబండి లింగం కూతురు వివా హం నిమిత్తం కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు మీసం మహేందర్‌ ఆదివారం ఆర్థిక సాయం అందించారు. అలాగే ఆ కుటుంబ సభ్యులకు 50 కిలోల బియ్యం అందజేశారు. ఈ సందర్భంగా మహేందర్‌ మాట్లాడుతూ పేదలకు సేవచేయడంలోనే నిజమైన సంతృప్తి లభిస్తుందన్నారు. కార్యక్రమంలో నాయకులు పరశురామ్‌, కనకరాజు, గణేశ్‌ తదితరులు ఉన్నారు.

నాణ్యమైన విద్యుత్‌

సరఫరా చేస్తాం

ములుగు(గజ్వేల్‌): రైతులకు నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేస్తామని ఆ శాఖ డైరెక్టర్‌ సాయిబాబా తెలిపారు. మండలంలోని క్షీరసాగర్‌ 33 కేవీ, తున్కిబొల్లారం 133 కేవీ విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌లను ఆదివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రానున్న వేసవి ని దృష్టిలో పెట్టుకుని వినియోగదారులకు ఎలాంటి అవాంతారాలు లేకుండా విద్యుత్‌ను అందించాలని ఇప్పటికే అధికారులకు సూచించామని, విధుల్లో నిర్లక్ష్యం వహించకుండా ప్రజలకు, రైతులకు అందుబాటులో ఉండా లని ఆదేశించారు. ఆయన వెంట విద్యుత్‌శాఖ డీఈ భానుప్రకాశ్‌, ఏడీఈ శ్రీనివాస్‌, ఏఈ శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

ప్రొఫెసర్‌కు అభినందన

కొండపాక(గజ్వేల్‌): ఉస్మానియా విశ్వ విద్యాలయం ఆర్ట్స్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌గా నియామకమైన ప్రొఫెసర్‌ ఖాసింను ఆదివారం దళిత సేన రాష్ట్ర ఉపాధ్యక్షుడు బాకి చంద్రభాను మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చంద్రభాను మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాల చరిత్ర కలిగిన ఉస్మానియా యూనివర్సిటీ ప్రిన్సిపాల్‌గా దళిత వర్గానికి కేటాయించిన ఘనత కాంగ్రెస్‌కే దక్కిందన్నారు. యూనివర్సిటీ సమస్యల పరిష్కారంలో ప్రత్యేక చొరవ చూపుతూ విద్యార్థులకు దిక్సూచిగా నిలుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నాయకులు రాజు తదితరులు పాల్గొన్నారు.

స్నేహితుడి కుటుంబానికి పూర్వవిద్యార్థుల సాయం

దుబ్బాకటౌన్‌: ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన రాయపోల్‌ గ్రామస్తుడు బ్యాగరి రమేశ్‌ కుటుంబానికి పూర్వ విద్యార్థులు అండగా నిలిచారు. 2007– 2008లో పదో తరగతి చదువుకున్న స్నేహితులు ఆదివారం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రూ.41 వేలు ఆర్థిక సహాయం అందజేశారు. కార్యక్రమంలో స్నేహితులు వెంకటేశ్‌, స్వామి, కరుణాకర్‌, ఆంజనేయులు, మధుసూదన్‌ రెడ్డి, విష్ణు తదితరులు పాల్గొన్నారు.

రేపు అష్టావధానం

నారాయణఖేడ్‌: మండలంలోని చాష్టా(కె) జిల్లాపరిషత్‌ ఉన్నత పాఠశాలలో మంగళవారం సాహితీ కళాప్రవీణ స్వర్ణకంకణ సత్కార గ్రహీత పద్యశిల్పి యువ అవధానిచే అష్టావధానం నిర్వహించనున్నట్లు పాఠశాల హెచ్‌ఎం నర్సింహులు తెలిపారు. పద్యకవి సీహెచ్‌. భూమయ్య రచించిన శ్రీరామశతకం ఆవిష్కరణోత్సవం సైతం ఉంటుందన్నారు. అష్టవధానులు కసిరెడ్డి వెంకటరెడ్డి, కంది శంకరయ్య, చక్రవర్తి హాజరవుతున్నారని చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
మార్కెట్‌ కమిటీ  డైరెక్టర్‌కు సన్మానం  
1
1/3

మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌కు సన్మానం

మార్కెట్‌ కమిటీ  డైరెక్టర్‌కు సన్మానం  
2
2/3

మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌కు సన్మానం

మార్కెట్‌ కమిటీ  డైరెక్టర్‌కు సన్మానం  
3
3/3

మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌కు సన్మానం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement