
గుండె ఆపరేషన్ల రిజిస్ట్రేషన్లకు ఆహ్వానం
కొండపాక(గజ్వేల్): కొండపాకలో నూతనంగా స్థాపించిన సత్యసాయి సంజీవనీ సెంటర్ ఫర్ హార్ట్ కేర్ రీసెర్చ్ సెంటర్లో చిన్న పిల్లలకు గుండె సంబంధిత చికిత్సల కోసం సోమవారం నుంచి రిజిస్ట్రేషన్లు చేసుకునే అవకాశం కల్పించినట్లు చైర్మన్ శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుట్టిన పిల్లవాడి నుంచి ఐదేళ్లలోపు పిల్లలకు ఉచితంగా గుండె సంబంధిత ఆపరేషన్లు చేస్తార న్నారు. పేషేంట్‌ను వారం రోజుల పాటు ఆసుపత్రిలో ఉంచి పరిశీలిస్తారని, వారితో తల్లిదండ్రులు కూడా ఉండటానికి వసతి కల్పిస్తారని చెప్పారు. రాష్ట్రంలో ఏ ప్రాంతానికి చెందినవారైనా సరే ఆపరేషన్ల కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని శ్రీనివాస్ తెలిపారు. ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మరింత సమాచారం కోసం 98495 55560 నంబరును సంప్రదించవచ్చని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment