
ఆరోగ్యంగా ఉంటేనే సామాజికాభివృద్ధి
గజ్వేల్‌రూరల్: ప్రజలు ఆరోగ్యవంతులుగా ఉన్నప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందని ప్రముఖ వైద్యుడు డాక్టర్ ఆకుల నరేశ్‌బాబు అన్నారు. పట్టణంలోని సంగాపూర్ రోడ్డులోని సంతోషిమాత దేవాలయం సమీపంలో ఆదివారం ప్రధాన మంత్రి భారతీయ జన ఔషధి కేంద్రం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా నరేశ్‌బాబు మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయడం ఎంతో సంతృప్తినిస్తుందన్నారు. ప్రజలు పౌష్టికరమైన ఆహారాన్ని తీసుకుంటూ ఆరోగ్యవంతులుగా ఉండాలని సూచించారు. తక్కువ ధరలకే నాణ్య మైన మందులను అందించాలనే ఉద్దేశ్యంతో జన ఔషధి కేంద్రాలు ఏర్పాటయ్యాయని చెప్పారు. శిబిరంలో ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో జన ఔషధి కేంద్రం నిర్వాహకులు భావన, రమణాచారి, వినోద్, గోపాల్, వెంకటేశ్, విజయ్‌కుమార్, హరీశ్, స్వామి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment