
సీసీ రోడ్ల నిర్మాణ పనులు పరిశీలన
మిరుదొడ్డి(దుబ్బాక): అక్బర్‌పేట–భూంపల్లి మండల కేంద్రంలోని డబుల్ బెడ్రూంల కాలనీలో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్ల నిర్మాణాలను రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ప్రతి సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ వడ్ల ప్రభాకర్, మాజీ ఎంపీటీసీ అబ్బుల ఉమారాణి, నాయకులు బాలాగౌడ్, ఉల్లెంగెల నరేశ్, బైరి నర్సింహులు, డక్కలి శ్రీను, కొరిమి సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment