
బ్యాంకు ఉద్యోగుల వాకథాన్
సిద్దిపేటకమాన్: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని యూనియన్ బ్యాంకు బ్యాంకు ఉద్యోగులు సోమవారం వాకథాన్ నిర్వహించినట్లు జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్ హరిబాబు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రాంతీయ కార్యాలయం నుంచి ప్రశాంత్‌నగర్ బ్రాంచ్ వరకు వాకథాన్ నిర్వహించామన్నారు. బ్యాంకు సేవింగ్ ఖాతా వివరాలు, ప్రయోజనాలు, మైక్రో సేవింగ్స్, ఎస్‌హెచ్‌జీ లింకేజీలు, బీమా సౌకర్యాలు, ముద్ర, పీఎంఈజీపీ రుణ పథకాల గురించి అవగాహన కల్పించామని, అలాగే మంగళవారం విపంచి కళానిలయంలో అవుట్‌రీచ్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. అదేవిధంగా 5న ఇర్కోడ్ గ్రామంలో మహిళలు, వృద్ధుల కోసం హెల్త్ క్యాంపు నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో స్థానిక బ్యాంకు మేనేజర్లు వికాస్, రాఘవ, సంజయ్, సిబ్బంది పాల్గొన్నారు.
జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ హరిబాబు
Comments
Please login to add a commentAdd a comment