
వైజ్ఞానిక పరిజ్ఞానం అవసరం
దుబ్బాకటౌన్: విద్యార్థులకు పాఠశాల స్థాయి నుంచే వైజ్ఞానిక పరిజ్ఞానం ఎంతో అవసరమని మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల బాలుర పాఠ శాల ప్రధానోపాధ్యాయురాలు స్వప్న, రాయపోల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నాగరాజు అన్నారు. దౌల్తాబాద్ మండలం లింగరాజుపల్లి ఎంజేపీ గురుకుల పాఠశాలలో రాయపోల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థుల సైన్సు ప్రదర్శనలను సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రదర్శనలు సందర్శించి విద్యార్థులు వివిధ వైజ్ఞానిక అంశాలపై పరిజ్ఞానాన్ని సంపాదించుకున్నారన్నారు. అనంతరం కిచెన్ గార్డెన్ పరిశీలించి వివిధ రకాల మొక్కల జీవన విధానాల గురించి తెలుసుకున్నారని చెప్పారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు బాలకుమార్, చంద్రకాంత్, వెంకటలక్ష్మి, వెంకట్, సంజయ్, నర్సింగరావు, రాము, హరీశ్, స్వాతి, గోవర్ధన్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment