
ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి పూజలు
మద్దూరు(హుస్నాబాద్): రాష్ట్రంలో పంటలు సమృద్ధిగా పండి, రైతులు, ప్రజలు సుఖ, సంతోషాలతో ఉండాలని ఆ పరమశివుడిని ప్రార్థించినట్లు జనగామ ఎమ్మెల్యే పల్లారాజేశ్వర్‌రెడ్డి చెప్పారు. మద్దూరు మండల పరిధిలోని గాగిల్లాపూర్ గ్రామంలోని శివాలయంలో సోమవారం నిర్వహించిన ఏడో వార్షికోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఆల య నిర్వాహకులు, అర్చకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం తీర్థప్రసాదాలు అందించారు. కార్య క్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు సంతోష్‌కుమార్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మల్లేశం, మాజీ సర్పంచ్ కృష్ణవేణి, చంద్ర మౌళి, మల్లేశం తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment