కొమురవెల్లి(సిద్దిపేట): మల్లికార్జున స్వామి పుష్కరిణిలో(కోనేరు) నీటిని శుద్ధిచేసే యంత్రాలను అమర్చాలని బీఆర్‌ఎస్ నాయకుడు ముత్యం నర్సింహులు డిమాండ్ చేశారు. సోమవారం ఇతర నాయకులతో కలిసి స్వామి వారి పుష్కరిణిని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పుష్కరిణిలో స్నానమాచరించి స్వామి వారిని దర్శించుకుంటే తమ కోర్కెలు తీరుతాయని భక్తుల నమ్మకం అని, అలాంటి పుష్కరిణిలో మురుగు చేరినా ఆలయ అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్లాస్టిక్, చెత్తాచెదారం ఉండడంతో భక్తులు ఇబ్బంది పడుతున్నారని, అధికారులు స్పందించి శుద్ధి యంత్రాలతో పాటు మహిళలు దుస్తులు మార్చుకోవడానికి గదులు ఏర్పాటు చేయాలని కో రారు. కార్యక్రమంలో మహేశ్, శ్రీధర్, ఆంజనేయులు, బాలయ్య తదితరులు పాల్గొన్నారు.
బీఆర్‌ఎస్ నాయకుడు నర్సింహులు
Comments
Please login to add a commentAdd a comment