
కాంగ్రెస్ తీరుతో ఎండుతున్న పంటలు
● మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్ కాలువలు వెలవెల ● నియోజకవర్గ ఇన్‌చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి
గజ్వేల్: మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్ కాలువల నుంచి సాగునీటిని వదలకపోవడంతో రైతుల పంటలు ఎండిపోయే దుస్థితి ఏర్పడిందని బీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం మండలంలోని శ్రీగిరిపల్లి వద్ద మల్లన్నసాగర్ నుంచి కొండపోచమ్మసాగర్ వెళ్లే కాలువను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేసీఆర్ హయాంలో ఎండాకాలంలోను కాల్వలు జలకళను సంతరించుకొని ఉండేవన్నారు. సాగునీరు విడుదల కాకపోవడంతో శ్రీగిరిపల్లి, అంగడికిష్టాపూర్, గణేష్‌పల్లి, చేబర్తి, అక్కారం, పరిసర గ్రామాల్లో పంటలు ఎండిపోతున్నాయని వాపోయారు. సంబంధిత అధికారులకు ఫోన్‌చేసి విషయం చెప్పినా స్పందించడం లేదని, సాగునీరు అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ప్రభుత్వ వైఖరిలో ఇప్పటికై నా మార్పురాకపోతే రైతుల పక్షాన ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఆయన వెంట మండల సర్పంచ్‌ల ఫోరం మాజీ అధ్యక్షుడు చంద్రమెహన్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment