
కొండంత లక్ష్యంపై కదలిక
సిద్దిపేటజోన్: జిల్లాలోని ఆయా మున్సిపాలిటీల్లో పేరుకుపోయిన ఆస్తిపన్ను బకాయిలకు మార్చి 31 నాటికి తుది గడువుపై సాక్షిలో సోమవారం ప్రచురించిన ‘కొండంత లక్ష్యం.. వసూలు అంతంత..’ కథనం జిల్లాలోని బల్దియా అధికారుల్లో కదలిక తెచ్చింది. ఈ ఆర్థిక సంవత్సర లక్ష్యం అధిగమించేందుకు ఈ నెలాఖరులోగా గడువు ఉండడంతో రెవెన్యూ అధికారులు ప్రత్యేక డ్రైవ్ చేపట్ట డానికి ప్రణాళికలు రూపొందించారు. అందులో భాగంగా ఆయా మున్సిపాలిటీ కమిషనర్లు క్షేత్రస్థాయిలో ఆస్తిపన్ను వసూలు ప్రక్రియ చేపడుతున్నారు. ప్రధానంగా మొండి బకాయిలను వసూలు చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకొంటున్నారు. మార్చి 31 నాటికి బల్దియా పరిధిలోని అన్ని అస్సె స్మెంట్ పన్నులు సంపూర్ణంగా వసూలు చేసి శతశాతం లక్ష్యం అధిగమించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. కమిషనర్, రెవెన్యూ అధికారులు, సిబ్బంది గ్రూపుల వారీగా వెళ్లి ఇంటి యజమానులకు అవగాహన కల్పించి పన్నులు వసూలు చేస్తున్నారు. ప్రజలు సకాలంలో పన్నులు చెల్లించి పట్టణ ప్రగతికి దోహదపడాలని సూచిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment