
సీసీ రోడ్లతో గ్రామాలు పరిశుభ్రం
కొండపాక(గజ్వేల్): సీసీ రోడ్లతో గ్రామాలను పరిశుభ్రంగా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి అన్నారు. మండలంలోని మర్పడ్గ, లకుడారం, మా త్‌పల్లి, మేదినీపూర్ గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మా ణాలకు సోమవారం ఆయన భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల్లో ప్రజల కిచ్చిన హామీల మేరకు గ్రామాభివృద్ధిలో భాగంగా సీసీ రోడ్ల నిర్మాణాలకు ప్రభుత్వం నిధులు మంజూ రు చేసిందన్నారు. పనులు పారదర్శకంగా జరిగేలా చూసుకోవాలని సూచించారు. మర్పడ్గలోని హై స్కూల్లో మరుగుదొడ్ల నిర్మాణాలకు అదనంగా రూ.2 లక్షలు మంజూరు అయ్యాయని చెప్పారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు లింగారావు, శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు మల్లేశంగౌడ్, తిరుపతిరెడ్డి, రుషి, రాజలింగం, కనకయ్య, కిష్టారెడ్డి, కరుణాకర్, ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.
సంక్షేమమే ధ్యేయం..
గజ్వేల్‌రూరల్: ప్రజల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని నర్సారెడ్డి అన్నారు. మండల పరిధిలోని బెజుగామ గ్రామంలో మాజీ ఎంపీటీసీ, కాంగ్రెస్ నాయకులు గంగాధర్ ఆధ్వర్యంలో తయారు చేయించిన 50 డప్పులను సోమవారం ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కార్యకర్తలు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఏఎంసీ వైస్‌చైర్మన్ సర్దార్‌ఖాన్, మాజీ సర్పంచ్ పోచయ్య, కాంగ్రెస్ నాయకులు శివారెడ్డి, బాబురావు, సాయిలు, నాగరాజు, నర్సయ్య, సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.
డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment