హుస్నాబాద్‌రూరల్: స్థానిక సంస్థల ఎన్నికల అనంతరం పోలింగ్ బాక్స్‌లను భద్రపరిచే కౌటింగ్ హాల్‌ను జెడ్పీ సీఈఓ రమేశ్ సోమ వారం పరిశీలించారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ లో గతంలో ఎన్నికల కౌటింగ్ నిర్వహించారని, ఇప్పుడు ఆ భవనాలు అనుకూలంగా ఉంటాయని ధ్రువీకరించినట్లు ఎంపీడీఓ వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు. వారి వెంట పీఆర్ డీఈ మహేశ్ ఉన్నారు.
సద్వినియోగం చేసుకోండి
సిద్దిపేటజోన్/దుబ్బాకటౌన్: స్థల క్రమబద్ధీకరణ రుసుముపై రాష్ట్ర ప్రభుత్వం 25 శాతం రాయితీ ప్రకటించిందని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్‌లు ఆశ్రిత్ కుమార్, శ్రీనివాస్ రెడ్డి సోమ వారం వేరువేరు ప్రకటనల్లో పేర్కొన్నారు. ఈ అవకాశం మార్చి ఆఖరు వరకే ఉందిని తెలిపారు. 2020లో ఎల్‌ఆర్‌ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్న స్థలాల యజమానులు ఈ నెల 31లోగా రాయితీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సందేహాలు ఉంటే 95055 07248 ఫోన్ నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.
మందుబాబులకు జరిమానా
సిద్దిపేటకమాన్/సిద్దిపేటఅర్బన్: మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడిన వాహనదారులకు సిద్దిపేట కోర్టు జరిమానా, జైలుశిక్ష విధించింది టూటౌన్ సీఐ ఉపేందర్, ట్రాఫిక్ సీఐ ప్రవీణ్‌కుమార్, త్రీటౌన్ సీఐ విద్యాసాగర్ తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని పలు ప్రాంతాలలో వారం రోజుల క్రితం నిర్వహించిన వాహన తనిఖీల్లో 24 మంది పట్టుబడ్డారు. వారిని సోమ వారం కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి రూ.36 వేల జరిమానా, ఒకరికి 11 రోజులు, మరొక వ్యక్తికి మూడు రోజుల జైలుశిక్ష విధించినట్లు పోలీసులు తెలిపారు.
ఇసుక ట్రాక్టర్ పట్టివేత
మద్దూరు(హుస్నాబాద్): మండలంలోని జాలపల్లి వాగు నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్‌ను రెవెన్యూ అధికారులు సోమవారం స్వాధీనం చేసుకొన్నారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మధుసూదన్ మా ట్లాడుతూ నంగునూరు మండలంలోని ఖాత కు చెందిన చందు ట్రాక్టర్ ద్వారా వాగులో నుంచి ఇసుకను తరలిస్తుండగా పట్టుకొని కార్యాలయానికి తరలించామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment