
చెరువులు నింపాలని నాయకుల వినతి
కొండపాక(గజ్వేల్): తపాస్‌పల్లి రిజర్వాయర్ నుంచి చెరువులకు సాగునీటిని విడుదల చేయాలని కోరుతూ అధికార పార్టీ నేతలు డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి, హౌజింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మడుపు భూంరెడ్డి రైతులతో కలిసి సోమవారం అదనపు కలెక్టరు అబ్దుల్ హమీద్‌కు వినతిపతరం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత పాలకులు తపాస్‌పల్లి రిజర్వాయర్ నుంచి కాలువల ద్వారా తిమ్మారెడ్డిపల్లి, కొండపాక, దమ్మక్కపల్లి, సిర్సనగండ్ల, జప్తినాచారం, ఖమ్మంపల్లి, మర్పడ్గ గ్రామాల్లోని చెరువులను నింపుతూ పంట పొలాలు ఎండిపోకుండా కాపాడారన్నారు. అలాగే దుద్దెడ, బందారం, అంకిరెడ్డిపల్లి, దర్గా గ్రామా ల్లోని చెరువులకు సైతం నీరువెళ్లేలా కాలువ తవ్వ కం పనులు చేపట్టాలని కోరారు. ఎండలు ముదరడంతో చెరువుల్లో నీటి నిల్వలు ఘణనీయంగా పడిపోయాయని, ప్రస్తుతం పంటలు పొట్ట దశకు చేరుకున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే కాలువ తవ్వకాల్లో భూములు కోల్పోతున్న రైతులకు నష్ట పరిహారం చెల్లించక పోవడంతో మేదినీపూర్, లకుడారం శివారులో పనులు ఆగిపోయాయని, రైతులకు నష్ట పరిహారం చెల్లించి పనులు ప్రారంభమయ్యేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో నాయకులు, రైతులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment