
ఇంటర్ పరీక్షలకు వేళాయె..
సిద్దిపేటఎడ్యుకేషన్: ఇంటర్మీడియెట్ పరీక్షలకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. బుధవారం నుంచి ప్రారంభం కానున్న పరీక్షలకు విద్యాధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా వ్యాప్తంగా జనరల్, ఒకేషన్, ప్రథమ, ద్వితీయ సంవత్సరం మొత్తం కలిపి 20,595 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ఇందుకోసం జిల్లా లో 43 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పోలీ స్, రెవెన్యూ, ఆర్‌టీసీ తదితర శాఖల అధికారు లతో సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు.
సీఎస్, డీఓల నియామకం
ప్రతి 24 మంది విద్యార్థులకు ఒక ఇన్విజిలేటర్, ప్రతీ పరీక్షా కేంద్రానికి ఒక చీఫ్ సూరింటెండెంట్ (సీఎస్), డిపార్ట్‌మెంటల్ అధికారుల(డీఓ)ను, 14 మంది అదనపు చీఫ్ సూపరింటెండెంట్(ఏసీఎస్)లను నియమించారు. మాస్‌కాపీయింగ్ జరగకుండా ఉండేందుకు పరీక్షల కన్వీనర్‌తో పాటు హైపవర్ కమిటీ, ఇద్దరు జిల్లా పరీక్షల కమిటీ సభ్యులు, రెండు ఫ్లైయింగ్, మూడు సిట్టింగ్ స్క్వాడ్స్ బృందాలను ఏర్పాటు చేశారు. పరీక్షాకేంద్రాల వద్ద పోలీస్ అధికారులు 144 సెక్షన్‌ను ఏర్పాటు చేశారు. విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు గాని ఎలాంటి సందేహాలున్నా నివృత్తి చేసుకునేందుకు జిల్లా కమాండ్ కంట్రోల్ నంబర్ 9949330191 నంబర్‌లో సంప్రదించాలని అధికారులు సూచించారు.
గంట ముందే చేరుకోవాలి
ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. విద్యార్థులు గంట ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి. పరీక్షా కేంద్రాల్లో అన్ని వసతులను కల్పించాం. వాచ్‌లు, ఎలక్ట్రానిక్ పరికాలకు పరీక్షా హాల్‌లోకి అనుమతి లేదు. ప్రశాంతమైన వాతావరణంలో ఒత్తిడికి గురికాకుండా విద్యార్థులు పరీక్షలు రాయాలి.
–రవీందర్‌రెడ్డి, జిల్లా ఇంటర్ విద్యాధికారి
ఉచిత ఆటో ఏర్పాటు
ఎమ్మెల్యే పల్లా వెల్లడి
నేటి నుంచి షురూ..
సర్వం సిద్ధం
జిల్లాలో 43 పరీక్షా కేంద్రాలు
20,595 మంది విద్యార్థులు
కొమురవెల్లి(సిద్దిపేట): ఇంటర్ పరీక్షలు రాసే విద్యార్థులకు ఉచిత ఆటో సౌకర్యం కల్పిస్తున్నట్లు జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు. ‘సాక్షి’లో ప్రచురితమైన ‘ఇంటర్ పరీక్ష.. దూరమే పెద్ద శిక్ష’ అనే కథనానికి ఎమ్మెల్యే స్పందించారు. చేర్యాల, ముస్త్యాలలో ఉన్న పరీక్ష కేంద్రాలకు విద్యార్థులు వెళ్లేందుకు బుధవారం నుంచి తన సొంత ఖర్చుతో ఉచితంగా ఆటో ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్లు ‘సాక్షి’కి తెలిపారు. దీంతో విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment