
కోడ్ తర్వాత కొత్త రేషన్ కార్డులు
హుస్నాబాద్: ఎన్నికల కోడ్ ముగియగానే అర్హులైన వారందరికీ కొత్త రేషన్ కార్డులు అందించనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. క్యాంప్ కార్యాలయంలో మంగళవారం జరిగిన ప్రత్యేక గ్రీవెన్స్‌లో మంత్రి వినతులు స్వీకరించారు. చదువుకున్న యువకులు ఉపాధి అవకాశాలు కల్పించాలని మంత్రి దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నియోజకవర్గంలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపర్చడానికి బుధవారం క్యాంప్ కార్యాలయంలో మెగా జాబ్ మేళాను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. వేసవిలో గ్రామాల్లో తాగునీటి సమస్యలు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. యంగ్ ఇండియా రెసిడెన్సియల్ స్కూల్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. గౌరవెల్లి, గండిపెల్లి ప్రాజెక్టు కాలువల భూ సేకరణ వేగంగా జరుగుతోందని, త్వరలోనే ప్రాజెక్టుల ద్వారా సాగునీరు అందిస్తామన్నారు. నియోజకవర్గంలో పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. గ్రామాల్లో నేతలందరూ సమన్వయం చేసుకొని పార్టీ పట్టిష్టతకు కృషి చేయాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక జరుగుతోందని, ఇల్లు లేని వారికి మొదటి ప్రాధాన్యత ఇస్తామన్నారు.
మంత్రికి సమస్యల వినతి
చిన్నకోడూరు(సిద్దిపేట): మండలంలోని పలు సమస్యలను పరిష్కరించాలని యూత్ కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి అజ్జు యాదవ్ మంగళవారం మంత్రి పొన్నం ప్రనభాకర్‌కు వినతి పత్రం అందజేశారు. మంత్రి స్పందించి సమస్యలు వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. పార్టీ బలోపేతంపై యువత ముందుకు రావాలని సూచించినట్లు తెలిపారు.
నేతలందరూ సమన్వయంతో
పని చేయాలి
మంత్రి పొన్నం ప్రభాకర్
నేడు క్యాంప్ కార్యాలయంలో జాబ్ మేళా
Comments
Please login to add a commentAdd a comment