
వరికి సస్యరక్షణ చర్యలు చేపట్టండి
కొమురవెల్లి(సిద్దిపేట): వరిలో కాండం తొలిచే పురుగు, అగ్గి తెగులు అధికంగా ఉందని, సస్యరక్షణ చర్యలు చేపట్టాలని జిల్లా వ్యవసాయ అధికారి రాధిక తెలిపారు. మంగళవారం మండలంలోని మర్రిముచ్చాల గ్రామంలో వరి పంటలు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అగ్గి తెగులు సోకిన వరి ఆకులపై కండె ఆకారంలో ఎర్రటి మచ్చ ఏర్పడి క్రమంగా ముదురు గోధుమరంగులోకి మారుతుందని, ఆకులు ఎండిపోతాయని అన్నారు. నివారణకు రైతులు యూరియా వాడకాన్ని తగ్గించి ట్రైసైక్లోజోన్ అనే మందును 0.6గ్రా. లేదా కసుగామైసిన్ మందును1.5మీ.లీ. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలన్నారు. కాండం తొలిచే పురుగు నివారణకు పొట్టదశలో ఎకరానికి కార్టఫ్ హైడ్రోక్లోరైడ్ 50 ఎస్పీమందుని పిచికారీ చేయాలని రైతుకుల సూచించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి వెంకట్రావమ్మ, ఏఈఓ రమ్య, రైతులు తదితరులు పాల్గొన్నారు.
కాండంతొలిచే పురుగు,
అగ్గి తెగులు అధికం
జిల్లా వ్యవసాయ అధికారి రాధిక
Comments
Please login to add a commentAdd a comment