
కాళేశ్వరంపై నిర్లక్ష్యం తగదు
చిన్నకోడూరు(సిద్దిపేట): బీఆర్‌ఎస్ పార్టీపై, కేసీఆర్ మీద కోపంతో కాళేశ్వరంపై నిర్లక్ష్యం తగదని ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. బుధవారం మండల పరిధిలోని రంగనాయక సాగర్‌లోకి నీటి పంపింగ్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాళేశ్వరం పిల్లర్ కుంగిపోయి 14 నెలలు అవుతున్నా ఇప్పటికీ బాగు చేయలేదన్నారు. ఎస్సారెస్పీ స్టేజీ 2 ప్రాంతాల్లో పంటలు ఎండిపోతున్నాయన్నారు. గతంలో ఎస్సారెస్పీ నీరు తగ్గినప్పటికీ కాళేశ్వరం ద్వారా రెండు పంటలకు సాగు నీరు అందించామన్నారు. అన్ని వర్గాలకు మంచి చేసే ప్రాజెక్టును నిర్లక్ష్యం చేయకూడదన్నారు.
ఎమ్మెల్యే హరీశ్‌రావు
Comments
Please login to add a commentAdd a comment