
విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలి
గజ్వేల్‌రూరల్: విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించడంతో పాటు నాణ్యత పాటించాలని అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్ అన్నారు. ప్రజ్ఞాపూర్‌లోగల మైనార్టీ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలను బుధవారం ఆమె సందర్శించారు. పాఠశాలలోని వంట గదిని, వినియోగించే నిత్యావసర సరుకులను పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ మెనూ తప్పక పాటించాలన్నారు. అనంతరం టెన్త్ విద్యార్థులతో మాట్లాడారు. పరీక్షల పట్ల భయం పెట్టుకోవద్దని, ఉత్తమ ఫలితాలు సాధించేలా ప్రణాళికా బద్దంగా ముందుకు సాగాలన్నారు. ఈ సందర్భంగా పరీక్షలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్రావణ్, ఎంఈఓ కృష్ణ, మున్సిపల్ కమిషనర్ నర్సయ్య, పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ గరీమాఅగర్వాల్
Comments
Please login to add a commentAdd a comment