రెండో రోజూ ఇంటర్ పరీక్షలు ప్రశాంతం
సిద్దిపేట ఎడ్యుకేషన్: ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షలు కొనసాగుతున్నాయి. గురువారం ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు సెకండ్ లాంగ్వేజ్ పేపర్లు తెలుగు, హిందీ, సంస్కృతం తదితర పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. జనరల్, ఒకేషనల్ మొత్తం కలిపి 9,452 మంది విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉండగా 335 మంది గైర్హాజరు అయ్యారు. 9117 మందితో 97శాతం హాజరు నమోదైంది. జిల్లా అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ పట్టణంలోని ఓ ప్రైవేట్ కళాశాలలోని పరీక్షా కేంద్రాన్ని సందర్శించారు. ఇంటర్ విద్యాధికారి రవీందర్‌రెడ్డి పట్టణంలోని ప్రభుత్వ కోఎడ్యుకేషన్ జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రంతో పాటు పలు ప్రైవేట్ కళాశాలల పరీక్షా కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. డీఈసీ సభ్యులు గంగాధర్, జ్యోతి ఉదయం పట్టణంలోని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లోని కస్టోడియన్ సెంటర్‌ను సందర్శించి ప్రశ్నపత్రాల బెండల్స్‌ను సీఎస్, డీఓలకు పంపిణీ చేసే విధానాన్ని పర్యవేక్షించారు. హైపవర్ కమిటీ సభ్యులు హిమబింధు చేర్యాల, ముస్త్యాల కేంద్రాలను, ఫ్లయింగ్ స్క్వాడ్ సభ్యులు తొగుట, మిరుదొడ్డి పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. పరీక్ష జరుగుతున్న తీరును పరిశీలించి సీఎస్, డీఓలను వివరాలు అడిగి తెలుసుకుని, రికార్డులను పరిశీలించి పలు సూచనలు, సలహాలను అందించారు.
97 శాతం హాజరు
పరీక్ష కేంద్రాల ఆకస్మిక తనిఖీలు
Comments
Please login to add a commentAdd a comment