మెదక్ ఎంపీ రఽఘునందన్‌రావు
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): జిల్లా కేంద్రంలోని పీఎఫ్ కార్యాలయాన్ని తరలించవద్దని కేంద్రమంత్రి మన్సుఖ్ మాండవీయను కోరగా, వెంటనే అధికారులకు ఆదేశాలు జారీ చేశారని ఎంపీ రఘునందన్‌రావు తెలిపారు. గురువారం నగరంలో జరిగిన తెలంగాణ జోనల్, రీజినల్ పీఎఫ్ కార్యాలయ బిల్డింగ్ ప్రారంభోత్సవానికి కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, మన్సుఖ్ మాండవీయాలు హాజరయ్యారన్నారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలో ఉన్న పీఎఫ్ కార్యాలయాన్ని ఇక్కడి నుంచి తరలించకుండా చొరవ చూపాలని ఎంపీ కేంద్రమంత్రిని కోరినట్లు తెలిపారు. అందుకు గాను కార్యక్రమంలోనే పీఎఫ్ కమిషనర్ రమేష్‌కృష్ణమూర్తికి ఆదేశాలు జారీ చేశారన్నారు. సిద్దిపేట పీఎఫ్ కార్యాలయ తరలింపును నిలిపివేయడంతో ఎంపీ మంత్రులకు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment