ములుగు(గజ్వేల్): విద్యార్థులు వినూత్న ఆలోచనలను అన్వేషించాలని ఇండియన్ కౌన్సిల్ అగ్రికల్చ ర్ రీసెర్చ్(ఐసీఎఆర్)డిప్యూటీ డైరెక్టర్ జనరల్(విద్య) డాక్టర్.ఆర్.సి అగర్వాల్ సూచించారు. ములుగులోని కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయంలో శుక్రవారం సెంట్రల్ ల్యాబ్, స్మార్ట్ క్లాస్ గదిని వైస్ చాన్స్‌లర్ డాక్టర్.డి.రాజిరెడ్డితో కలసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విద్యార్థులు ఆధునిక సాంకేతిక పరిజ్ణానాన్ని ఉపయోగించుకోవడంతో పాటు వ్యవసాయ పురోగతికి చురుకుగా దోహదపడాలన్నారు. విశ్వవిద్యాలయంలోని సెంట్రల్ ల్యాబ్, స్మార్ట్ క్లాస్ గదులు అభ్యాస అనుభవాన్ని మెరుగుపరుస్తాయని, పరిశోధన, విద్యానైపుణ్యం కోసం విద్యార్థులకు అత్యాధునిక వనరులను అందిస్తాయని తెలిపారు. విశ్వవిద్యాలయ అధికారులు భగవాన్, లక్ష్మీనారాయణ, రాజశేఖర్, విజయ, శ్రీనివాసన్, నాగేశ్వర్‌రావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment