ముందు మీ తప్పులను సరిదిద్దుకోండి
గజ్వేల్‌రూరల్: బీఆర్‌ఎస్‌కు ప్రజలు వీఆర్‌ఎస్ ఇచ్చారని, ఇప్పటికై నా ఆ పార్టీ నాయకులు బీజేపీని విమర్శించే ముందు తమ తప్పులను సరిచేసుకోవాలని మెదక్ ఎంపీ రఘునందన్‌రావు పేర్కొన్నారు. గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రజ్ఞాపూర్‌లో గల త్రిశక్తి దేవాలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం జన ఔషది దివాస్ సందర్భంగా గజ్వేల్‌లోని జనరిక్ మెడికల్ దుకాణంను సందర్శించారు. ఈ సందర్భంగా రఘునందన్‌రావు మాట్లాడుతూ.. బీసీలకు బీజేపీ అన్యాయం చేసిందని ఎమ్మెల్సీ కవిత మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని, కేసీఆర్‌కు చెప్పి బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బీసీకి కేటాయించేలా చూడాలని కవితకు సూచించారు. గతంలో ఈటెల రాజేందర్‌ను మంత్రి పదవి నుంచి తొలగించింది బీఆర్‌ఎస్ పార్టీ కాదా అని ప్రశ్నించారు. ఇటీవల జరిగిన టీచర్స్, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ ఒకటి ఓసీలకు, మరొకటి బీసీలకు కేటాయించిందని గుర్తు చేశారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్, నాయకులు ఎల్లు రాంరెడ్డి, నలగామ శ్రీనివాస్, జశ్వంత్‌రెడ్డి, వెంకటరమణ, రాంరెడ్డి, కుడిక్యాల రాములు, శివకుమార్, శశిధర్‌రెడ్డి, సురేష్, మహేష్, మనోహర్‌యాదవ్, అశోక్‌గౌడ్, జన ఔషధి దుకాణం నిర్వాహకులు రమణాచారి, వినోద్‌తోపాటు ఆయా మండలాల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
మెదక్ ఎంపీ రఘునందన్‌రావు
Comments
Please login to add a commentAdd a comment