కొమురవెల్లి(సిద్దిపేట): కొమురవెల్లి మల్లికార్జున స్వామికి రూ.69.11లక్షల ఆదాయం లభించినట్లు ఆలయ సిబ్బంది వెల్లడించారు. స్వామి వారి ఆలయంలో 15రోజుల హుండీ ఆదాయాన్ని మెదక్ దేవాదాయశాఖ ఇన్‌స్పెక్టర్ రంగారావు, ఆలయ కార్యనిర్వహణ అధికారి రామాంజనేయులు ఆధ్వర్యంలో ఆలయ సిబ్బంది, శివరామకృష్ణ భజనమండలి సభ్యులు శుక్రవారం లెక్కించారు. నగదు రూ 69,11,633, విదేశి కరెన్సీ నోట్లు 14, మిశ్రమ బంగారం 46 గ్రాములు, మిశ్రమ వెండి 5కిలోల 200 గ్రాములు, పసుపు బియ్యం15 క్వింటాళ్లు వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. అనంతరం నగదును స్థానిక తెలంగాణ గ్రామీణావికాస్ బ్యాంక్‌లో జమ చేశారు.
రాజీపడేట్లు చూడాలి
జిల్లా ప్రధాన న్యాయమూర్తి
సాయిరమాదేవి
సిద్దిపేటకమాన్: జాతీయ లోక్ అదాలత్‌లో ఎక్కువ మొత్తంలో కేసులు రాజీ అయ్యేట్లు చూడాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయిరమాదేవి తెలిపారు. లోక్ అదాలత్‌ను పురస్కరించుకుని జిల్లా బార్ అసోసియేషన్ న్యాయవాదులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. లోక్ అదాలత్‌లో సివిల్, క్రిమినల్, మోటారు రోడ్డు ప్రమాద కేసుల్లో రాజీ కుదిర్చి అధిక మొత్తంలో కేసులు రాజీ అయ్యేట్లు చూడాలన్నారు. మహిళ దినోత్సవం సందర్భంగా మహిళా న్యాయవాదులకు సన్మానం చేశారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు స్వాతిరెడ్డి, మిలింద్‌కాంబ్లి, శ్రావణి, తరణి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జనార్థన్‌రెడ్డి, సెక్రటరీ మంతూరి సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment