రాష్ట్రంలోనే తొలి స్క్రాపింగ్ కేంద్రం
జిల్లా ట్రాన్స్‌పోర్ట్ అధికారి కొండల్‌రావు
వర్గల్(గజ్వేల్): కాలుష్య నియంత్రణలో భాగంగా కాలం చెల్లిన వాహనాలను స్క్రాపింగ్ చేసేందుకు రాష్ట్రంలోనే తొలి కేంద్రం ఏర్పాటైంది. వర్గల్ మండలం చందాపూర్‌లో పాతవాహనాలను రీసైక్లింగ్ చేసేందుకు అంబర్ ఎంటర్‌ప్రైజెస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వాహన స్క్రాపింగ్‌కేంద్రాన్ని జిల్లా ట్రాన్స్‌పోర్ట్ అధికారి కొండల్‌రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...తెలంగాణలోనే ఇది తొలి స్క్రాపింగ్ కేంద్రమన్నారు. సామాజిక బాధ్యతగా ప్రతీ ఒక్కరు పదిహేనేళ్లు ముగిసిన కాలం చెల్లిన వాహనాలను స్క్రాపింగ్ కేంద్రాలలో అప్పగించి సహకరించాలని సూచించారు. కాలుష్యకారక, కాలం చెల్లిన వాహనాల నియంత్రణ, పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక పాలసీతో స్క్రాపింగ్ విధానాన్ని అమలుచేస్తున్నాయని తెలిపారు. కాలం చెల్లిన వాహనాల వాహనాల స్క్రాపింగ్ కోసం వాటి యజమానులకు ప్రభుత్వం వివిధ రకాల రాయితీలతో ప్రోత్సహిస్తుందని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment