
సాగేనా?
ఎల్‌ఆర్‌ఎస్
ముందుకు
సాక్షి, సిద్దిపేట: ప్రభుత్వం రాయితీ ప్రకటించడంతో ఎల్‌ఆర్‌ఎస్ ప్రక్రియ ఇప్పటికై నా ముందుకు సాగుతుందా? అనే చర్చ జరుగుతోంది. ఎల్‌ఆర్‌ఎస్ (లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీం) కింద ప్లాట్ క్రమబద్ధీకరణ చేసుకునే వారికి ప్రభుత్వం రాయితీని కల్పించింది. 2020లో చేసిన దరఖాస్తు దారులు పలువురు ఇంటి నిర్మాణం, మరికొందరు ప్లాట్లను విక్రయించారు. దీంతో ప్రభుత్వం ప్రకటించిన రాయితీకి ముందుకు రావడం కొంత అనుమానంగానే ఉంది. అలాగే సర్వర్ చాలా నెమ్మదిగా ఉండటంతో దరఖాస్తు దారులు చాలా ఇబ్బంది పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 1,00,632 మంది దరఖాస్తు చేయగా 79,220 ప్లాట్లకు ఆటోమెటిక్ ఫీజు చెల్లింపు సమాచారాన్ని ఆయా ఫోన్ నెంబర్లకు పంపించారు. ఇంకా 21,412 ప్లాట్‌ల యజమానులకు ఫీజు చెల్లింపు సమాచారం వెళ్లలేదు.
ఇప్పటి వరకు 27 మందే
ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు ఒకేసారి చెల్లిస్తే ప్రభుత్వం 25శాతం రాయితీని ప్రకటించింది. ఈ ఆఫర్‌ను ఫిబ్రవరి 20వ తేదీ నుంచి ప్రారంభించింది. ఎల్‌ఆర్‌ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో ఇప్పటి వరకు ప్రభుత్వం కల్పించిన రాయితీకి స్పందించి 27 ప్లాట్లకు ఫీజును చెల్లించారు. ఈ నెలాఖరులోగా చెల్లించిన వారికి ఈ ఆఫర్‌ను వర్తింపజేయనుంది. అలాగే 2020 ఆగస్టు 26 నాటికి లే అవుట్లలోని 10శాతం ప్లాట్లు రిజిస్ట్రేషన్ జరిగితే మిగతా ప్లాట్లను రిజిస్ట్రేషన్ సమయంలో విక్రయ దస్తావేజుతో క్రమబద్ధీకరణకు అవకాశం కల్పించింది.
మరో మారు పరిశీలన
నిషేధిత జాబితాల్లో లేని భూములు, చెరువులు, కుంటలకు 200మీటర్ల పరిధిలో లేని ప్లాట్ల దరఖాస్తులకు ఆటోమెటిక్‌గా ఫీజు సమాచారం పంపిస్తున్నారు. ఫీజు చెల్లించిన తర్వాత వాటిని టౌన్ ప్లానింగ్, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు మరోసారి ఆ ప్లాట్‌ను పరిశీలించి అన్ని సరిగా ఉంటేనే అమోదం తెలపనున్నారు. వివిధ కారణాలతో దరఖాస్తు తిరస్కరణకు గురైతే ప్రాసెసింగ్ చార్జీల కింద 10శాతం మినహాయించుకుని మిగిలిన 90శాతం డబ్బులను వెనక్కి ఇస్తామని పురపాలక శాఖ ప్రకటించింది. అమోదం తెలిపిన వాటికి ల్‌ఆర్‌ఎస్ పే చేసినట్లు ధ్రువపత్రం జారీ చేయనున్నారు.
ఈ నెలాఖరు వరకు
25శాతం రాయితీ
జిల్లా వ్యాప్తంగా
1,00,632 దరఖాస్తులు
ఫీజు చెల్లింపు సమాచారం
79,220 మందికే..
ఇప్పటికే చాలా వరకు
చేతులు మారిన ప్లాట్లు
మున్సిపాలిటీ దరఖాస్తులు ఫీజు చెల్లింపు
చేర్యాల 6,069 2,575
దుబ్బాక 1,884 1,594
గజ్వేల్ 11,548 10,138
హుస్నాబాద్ 6,054 3,982
సిద్దిపేట 32,354 24,258
సుడా 21,380 20,688
గ్రామాలు 21,343 15,985
చేతులు మారాయి..
2020లో ఎల్‌ఆర్‌ఎస్ కోసం దరఖాస్తులను స్వీకరించారు. దరఖాస్తు చేసి ఇప్పటికీ ఐదేళ్లు కావస్తుండటంతో ప్లాట్లు చేతులు మారాయి. ఎల్‌ఆర్‌ఎస్ కోసం దరఖాస్తు చేసినప్పటికీ పలువురు ప్లాట్లను అర్థిక అవసరాల నిమిత్తం విక్రయించుకున్నారు. ఇలా కొన్ని ప్లాట్లు ఐదుగురు నుంచి ఆరుగురికి చేతులు మారాయి. దీంతో దరఖాస్తు చేసిన వ్యక్తి ప్రస్తుతం ప్లాట్ కొనుగోలు చేసిన వ్యక్తి తెలియదు. దీంతో ఎల్‌ఆర్‌ఎస్ సమాచారం అందరికీ చేరడం లేదు. దరఖాస్తు చేసే సమయంలో సెల్ నెంబర్లను సైతం అప్‌లోడ్ చేశారు. అలాగే కొందరి ఫోన్ నంబర్లు పని చేయకపోవడంతో ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు చెల్లింపు సమాచారం చేరడం లేదు.
సమాచారం
సద్వినియోగం చేసుకోవాలి
ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తు దారులు ప్రభుత్వం కల్పించిన 25శాతం రాయితీని సద్వినియోగించుకోవాలి. ఈ నెలాఖరులోగా ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు చెల్లించిన వారికి ఈ ఆఫర్ వర్తించనుంది. స్థలాలు కొనుగోలు చేసిన వారు, ఫోన్ నంబర్ మారిన వారు వారి వివరాలను అప్‌డేట్ చేయించుకోవాలి. స్థలం అమ్మిన వారు దరఖాస్తు చేస్తే వివరాలు అప్‌డేట్ చేసుకుంటే కొనుగోలు చేసిన వారి పేరు మీదనే ఎల్‌ఆర్‌ఎస్ ధ్రువపత్రం జారీ చేయనున్నాం.
– వందనం, సీపీఓ, సుడా

సాగేనా?

సాగేనా?
Comments
Please login to add a commentAdd a comment