
అధికారులపై చర్యలు తీసుకోండి
సిద్దిపేటకమాన్: హైకోర్టు ఆర్డర్‌ను ధిక్కరించిన పురపాలిక టౌన్ ప్లానింగ్ అధికారులపై చర్యలు తీసుకోవాలని కౌన్సిల్ ఫర్ సిటీజన్ రైట్స్ సంస్థ రాష్ట్ర కార్యదర్శి శివచంద్రం అన్నారు. సిద్దిపేట ప్రెస్‌క్లబ్‌లో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సిద్దిపేటలో అక్రమంగా నిర్మిస్తున్న నిర్మాణంపై హైకోర్టు ఇచ్చిన ఆర్డర్‌ను మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారి పట్టించుకోవడంలేదన్నారు. మున్సిపల్ కార్యాలయంలో జరుగుతున్న అవినీతిపై చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో సభ్యులు రాజు, రవితేజ, గణేష్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment