
15 శాతం నిధులు కేటాయించాలి
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): రాష్ట్ర బడ్జెట్‌లో విద్యారంగానికి 15 శాతం నిధులు కేటాయించాలని ఏబీవీపీ జిల్లా కన్వీనర్ సావుల ఆదిత్య అన్నారు. బుధవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలో జరిగిన ఏబీవీపీ సమావేశంలో జిల్లా కన్వీనర్ ఆదిత్య ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సకలజనులు పోరాడి తెచ్చు కున్న తెలంగాణలో మొదటి పదేళ్లలో కేసీఆర్ ప్రభు త్వం విద్యా వ్యవస్థను పూర్తిగా చిన్నాభిన్నం చేశారన్నారు. నిధులు కేటాయించకుండా విద్యావ్యవస్థను గత ప్రభుత్వం అధోపాతాలానికి తొక్కితే, రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా అదే దారిలో వెళ్తుందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఫణిందర్, అంబేడ్కర్ జోనల్ ఇన్‌చార్జి అనీష్, నగర ఉపాధ్యక్షుడు భాను, నగర సంయుక్త కార్యదర్శి రాకేశ్, హరికృష్ణ, శ్రావణ్, మైపాల్ పాల్గొన్నారు.
కలెక్టరేట్ వరకు పాదయాత్ర
సిద్దిపేటరూరల్: రాష్ట్ర బడ్జెట్‌లో విద్యకు 15 శాతం నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ దళిత బహుజన ఫ్రంట్ ఆధ్వర్యంలో బుధవారం పట్టణంలోని పాత బస్టాండ్ అంబేడ్కర్ విగ్రహం నుండి జిల్లా కలెక్టరేట్ వరకు పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో విద్యారంగానికి 15 శాతం నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చి విస్మరించిందన్నారు. 2024– 25 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో కేవలం 6.3 శాతం నిధులు కేటాయించి హామీని తుంగలో తొక్కిందన్నారు. ఈ బడ్జెట్ లోనైనా ఎన్నికల హామీ ప్రకారం 15 శాతం నిధులు కేటాయించి మాట నిలబెట్టుకోవాలని సీఎంకి విజ్ఞప్తి చేశారు. అనంతరం కలెక్టరేట్ ఏఓకు వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి ఏగొండ, జిల్లా ఉపాధ్యక్షుడు భీమ్ శేఖర్, పోతరాజు శంకర్, జిల్లా ప్రధాన కార్యదర్శి భ్యాగరి వేణు, బెజ్జెంకి తిరుపతి, దశరథం, ప్రకాశ్, తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర బడ్జెట్‌లో విద్యా రంగానికి పెద్దపీట వేయాలి
ఏబీవీపీ జిల్లా కన్వీనర్ ఆదిత్య
Comments
Please login to add a commentAdd a comment