
విదేశాలకు ఎగుమతితో మంచి లాభాలు
కౌడిపల్లి(నర్సాపూర్): మామిడి పండ్లను విదేశాలకు ఎగుమతి చేయడం వల్ల అధిక లాభాలు పొందవచ్చని ఏపీఈడీఏ (అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్‌స్ ఎక్స్‌పోర్ట్ డెవలప్‌మెంట్ అథారిటీ) అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఆర్‌పీ నాయుడు సూచించారు. బుధవారం మండలంలోని తునికి వద్ద గల డాక్టర్ డి.రామానాయుడు ఏకలవ్య గ్రామీణ వికాస ఫౌండేషన్ కృషి విజ్ఞాన కేంద్రం(కేవీకే)లో ఏపీఈడీఏ ఆధ్వర్యంలో మామిడి సాగు రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు నాణ్యమైన మామిడి పంటను ఉత్పత్తి చేస్తే విదేశాలకు ఎగుమతి చేయొచ్చన్నారు. దీంతో అధిక లాభాలు వస్తాయన్నారు. విదేశాలకు ఎగుమతి చేసేందుకు ప్రభుత్వ లైసెన్స్ అవసరం ఉంటుందన్నారు. అనంతరం కేవీకే హెడ్ అండ్ సైంటిస్ట్ శంభాజీ దత్తాత్రేయ నల్కర్ మాట్లాడుతూ.. ప్రస్తుతం మామిడి పంట పిందె దశలో ఉన్నాయని జాగ్రత్తలు పాటించాలని సూచించారు. పూత పిందె రాలితే శాస్త్రవేత్తల సూచనలు పాటించాలన్నారు. మామిడి తోటను ప్రతి రోజూ గమనించి తెగులు, చీడపీడలు సోకకుండా చర్యలు తీసుకుని సస్యరక్షణ చర్యలు చేపట్టాలని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా హార్టికల్చర్ అధికారి ప్రతాప్‌సింగ్, కేవీకే శాస్త్రవేత్త శ్రీనివాస్, నర్సాపూర్ డివిజన్ హర్టికల్చర్ అధికారి సంతోష్, ఆయిల్‌ఫామ్ మేనేజర్ క్రిష్ణ, వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు.
ఏపీఈడీఏ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఆర్‌పీ నాయుడు
కేవీకేలో మామిడి రైతులకు అవగాహన సదస్సు
Comments
Please login to add a commentAdd a comment