మున్సిపాలిటీ స్వరూపం.. | - | Sakshi
Sakshi News home page

మున్సిపాలిటీ స్వరూపం..

Published Thu, Mar 13 2025 2:36 PM | Last Updated on Thu, Mar 13 2025 2:36 PM

మున్స

మున్సిపాలిటీ స్వరూపం..

నర్సాపూర్‌ చెరువులో గుర్రపు డెక్క

చెరువుల్లో గుర్రపు డెక్క

మున్సిపాలిటీ పరిధిలోని చెరువులు, కుంటలలో చెత్తాచెదారం పేరుకుపోయింది. ఎర్రచెరువు, నర్సాపూర్‌ చెరువులు గుర్రపు డెక్కతో నిండిపోయాయి. కోమటిచెరువు కెనాల్‌లో పిచ్చి మొక్కలు, చెత్త పేరుకుపోయి ప్రజలకు తీవ్ర అసౌకర్యానికి గురి చేస్తున్నాయి. ప్రధాన కాలువ చుట్టూ బఫర్‌ జోన్‌లలో నిర్మాణాలు చేపడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు.

మున్సిపాలిటీ ఏర్పడిన సంవత్సరం: 1952

విస్తీర్ణం: 54,55చదరపు కిలోమీటర్లు.

జనాభా: 1,77,879

వార్డులు: 43

రెవెన్యూ జోన్‌లు:17

పట్టణంలో ఇళ్లు: 42,325

మంచినీటి పథకాలు: యశ్వడ..

మిషన్‌భగీరథ

పట్టణానికి అవసరమైనతాగునీరు: 21,20 ఎంఎల్‌డి..

చెత్త సేకరణ వాహనాలు: 51

పబ్లిక్‌ టాయిలెట్స్‌: 48

వీధి దీపాలు: 15,000

బస్తీ దవాఖానాలు: 3

స్వయం సహాయక సంఘాలు: 2,147

వీధి వ్యాపారులు: 7,768

సిద్దిపేటజోన్‌: స్మార్ట్‌ సిటీ లక్ష్యంగా పట్టణంలో రూ.300 కోట్లతో 274కిలోమీటర్ల పొడవునా మూడు దశల్లో అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ నిర్మాణం చేపట్టారు. ఇప్పటివరకు రెండు దశల్లో పనులు పూర్తి అయ్యాయి. పలు చోట్ల చిన్న వర్షాలకే డ్రైనేజీ మ్యాన్‌ హోల్స్‌ పొంగిపొర్లుతున్నాయి. దీంతో మురుగు రోడ్లపై ఎరులై పారుతోంది. ఫలితంగా ఆ మార్గం గుండా వెళ్లాలంటేనే జనం ఇబ్బంది పడుతున్నారు. అలాగే హౌసింగ్‌ బోర్డు కాలనీ, ఆర్టీసీ పెట్రోల్‌ పంప్‌ దగ్గర మ్యాన్‌హోల్స్‌ నుంచి మురుగు నీరు రోడ్లపైకి వస్తున్నాయి. పట్టణ పరిధిలోని మారుతినగర్‌, ప్రియదర్శినగర్‌, మైత్రివనం ఫేస్‌–2, హరిప్రియానగర్‌, గాడిచర్లపల్లి, సుడా కార్యాలయం బ్యాక్‌సైడ్‌, టీహెచ్‌ఆర్‌ కాలనీ, వడ్డెరకాలనీ యూజీడీ లేకపోవడంతో పలు చోట్ల రోడ్లపైకే నీటి వృథాగా వదిలేస్తున్నారు.

కొత్త కాలనీలైన మైత్రీవనం ఫేజ్‌–2, మారుతినగర్‌, టెలికాంనగర్‌, ఆదర్శనగర్‌, కేసీఆర్‌ కాలనీ, ఇందిరమ్మ కాలనీలలో అవసరాలకు అనుగుణంగా విద్యుత్‌ స్తంభాలు ఏర్పాటు చేయలేదు. కొన్ని చోట్ల ఏర్పాటు చేసినా వాటికి లైట్లు ఏర్పాటు చేయకపోవడంతో రాత్రి అయ్యిందంటే చాలు అంధకారంలో మగ్గుతున్నాయి. రాత్రి వేళ స్థానిక ప్రజలు బయటకు రావాలంటే జంకుతున్నారు. ఇక వర్షాకాలంలో రోడ్లన్నీ బురదమయంగా మారుతున్నాయి. దీంతో వాహనదారులు, స్థానికులు ప్రమాదాల బారిన పడుతున్నారు.

పలు కాలనీలలోని ఖాళీ స్థలాల్లో చెత్తదారం, వర్షపు నీళ్లు నిలుస్తున్నాయి. మురికి కాలువలు శుభ్రం చేకపోవడంతో దోమలు వృద్ధి చెందుతున్నాయి. పట్టణంలో 43 వార్డులుండగా ఒకే ఫాగింగ్‌ మిషన్‌ ఉంది. దీంతో దోమల నియంత్రణ కరువైంది. దోమలతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. దోమలు కుట్టడంతో పలువురు అనారోగ్యం బారీన పడుతున్నారు. దోమల నియంత్రణకు ఫాగింగ్‌ చేయాలని ప్రజలు కోరుతున్నారు.

సిద్దిపేట మున్సిపాలిటీలో ప్రజల అవసరాలను గుర్తించి ప్రధాన రహదారులకు ఇరువైపులా ఫుట్‌పాత్‌లను ఏర్పాటు చేశారు. మెదక్‌, హైదరాబాద్‌, కరీంనగర్‌ మార్గంలో ఉన్న ఫుట్‌పాత్‌ లను ఆక్రమించి కొందరు వ్యాపారం చేస్తున్నారు. నడవడానికి అవకాశం లేక పాదచారులు రోడ్డుపైనే నడవాల్సి వస్తోంది. దీంతో ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. కొందరైతే ఫుట్‌పాత్‌లపైనే పర్మినెంట్‌ నిర్మాణాలు చేపట్టి వ్యాపారాలు కొనసాగిస్తుండటం గమనార్హం. అధికారులు కాసులకు ఆశపడి పట్టించుకోవడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు.

జిల్లా కేంద్రంలో ట్రాఫిక్‌ నియంత్రణ కోసం ఏర్పాటు చేసిన ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ అలంకరణ ప్రాయంగా మారుతున్నాయి. ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ పనిచేయక పోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. తరుచూ మరమ్మతులు చేయాల్సిన పరిస్థితి కొన్ని కూడళ్లలో ఉంది. ముఖ్యంగా సుభాష్‌ రోడ్‌, కమాన్‌రోడ్‌, మార్కెట్‌ రోడ్‌ నిత్యం రద్దీగా ఉంటోంది. ఇరుకై న రహదారుల వల్ల ప్రజలు, వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు.

పేరుకే రైతు బజార్లు

పట్టణ ప్రజల అవసరాలను గుర్తించి బల్దియాలో రైతు బజార్లు ఏర్పాటు చేశారు. ఇంటిగ్రేటెడ్‌ వెజ్‌, నాన్‌వెజ్‌ మార్కెట్లతో పాటు మరో నాలుగు రైతు బజార్లు ఉన్నాయి. కానీ వీటిలో కొన్ని వినియోగంలో లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా పట్టణంలో ఇష్టానుసారంగా వివిధ ప్రాంతాల్లో మాంస విక్రయాలు జరగడంతో నాన్‌వెజ్‌ మార్కెట్‌ ఏర్పాటు లక్ష్యం నీరు గారుతోంది. ఇప్పటికై న అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి పట్టణంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
మున్సిపాలిటీ స్వరూపం.. 1
1/12

మున్సిపాలిటీ స్వరూపం..

మున్సిపాలిటీ స్వరూపం.. 2
2/12

మున్సిపాలిటీ స్వరూపం..

మున్సిపాలిటీ స్వరూపం.. 3
3/12

మున్సిపాలిటీ స్వరూపం..

మున్సిపాలిటీ స్వరూపం.. 4
4/12

మున్సిపాలిటీ స్వరూపం..

మున్సిపాలిటీ స్వరూపం.. 5
5/12

మున్సిపాలిటీ స్వరూపం..

మున్సిపాలిటీ స్వరూపం.. 6
6/12

మున్సిపాలిటీ స్వరూపం..

మున్సిపాలిటీ స్వరూపం.. 7
7/12

మున్సిపాలిటీ స్వరూపం..

మున్సిపాలిటీ స్వరూపం.. 8
8/12

మున్సిపాలిటీ స్వరూపం..

మున్సిపాలిటీ స్వరూపం.. 9
9/12

మున్సిపాలిటీ స్వరూపం..

మున్సిపాలిటీ స్వరూపం.. 10
10/12

మున్సిపాలిటీ స్వరూపం..

మున్సిపాలిటీ స్వరూపం.. 11
11/12

మున్సిపాలిటీ స్వరూపం..

మున్సిపాలిటీ స్వరూపం.. 12
12/12

మున్సిపాలిటీ స్వరూపం..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement