
16న మహిళా జాబ్‌మేళా
ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి
దుబ్బాక: పట్టణంలో ఈనెల 16న మహిళల కోసం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ఉదయం 10 నుంచి 2 గంటల వరకు జాబ్ మేళా ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. నగరంలోని కొంగర్ కలాన్‌లోని ప్రముఖ ఎలక్ట్రానిక్స్ కంపెనీ(ఎంఎన్‌సీ)లో మహిళలకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకే జాబ్ మేళా ఏర్పాటు చేశామన్నారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ పాస్, ఫెయిల్ తో పాటు పాలిటెక్నిక్, ఐటీఐ అర్హతలు ఉన్న మహిళలకు ఈ కంపెనీలో అవకాశాలున్నాయన్నారు. దుబ్బాక నియోజకవర్గంలోని ఆసక్తి గల మహిళలు తమ సర్టిఫికెట్లతో జాబ్ మేళాకు హాజరు కావాలన్నారు.
డీసీసీబీ చైర్మన్‌కుపితృ వియోగం
కొండపాక(గజ్వేల్): ఉమ్మడి మెదక్ జిల్లా డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్‌రెడ్డి తండ్రి చిట్టి రాంరెడ్డి(80) హైదరాబాద్‌లో మృతి చెందారు. స్వగ్రామమైన కొండపాకలో బుధవారం అంత్యక్రియలు నిర్వహించారు. అంతకు ముందు డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి, ఎఫ్‌డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, తహసీల్దార్ దిలీప్ నాయక్, సీఐ లతీఫ్, ఎంపీడీఓ వెంకటేశ్వర్లు, అధికారులు, మాజీ ప్రజా ప్రతినిధులు తదితరులు డీసీసీబీ చైర్మన్‌ను పరామర్శించి ఓదార్చారు.
పుస్తక ప్రదర్శన
వర్గల్(గజ్వేల్): దశాబ్ది కార్యక్రమాల సందర్భంగా వర్గల్ జ్యోతిబాపూలే గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో బుధవారం లైబ్రరీ డే నిర్వహించారు. ఆకట్టుకున్న ఈ మహా పుస్తక ప్రదర్శనలో గ్రంథాలయంలోని 22,241 గ్రంథాలను ప్రదర్శించారు. ఇందులో 9,062 రెఫరెన్స్ బుక్స్, 2,233 డొనేషన్ ద్వారా సమకూరిన బుక్స్, 676 పోటీ పరీక్షల పుస్తకాలు, 9,376 పాఠ్యాంశ సంబంధ బుక్స్, 894 జనరల్ బుక్స్, 11 పీరియాడికల్స్, 6 దినపత్రికలున్నాయి. ప్రిన్సిపాల్ భాస్కర్‌రావు, లైబ్రేరియన్ బాలలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు ఉత్సాహంగా పుస్తక ప్రదర్శన తిలకించారు.

16న మహిళా జాబ్‌మేళా
Comments
Please login to add a commentAdd a comment