
ఇప్పటికీ గ్రౌండింగ్ నో
సాక్షి, సిద్దిపేట: ఎస్సీ కార్పొరేషన్ ఎకనామిక్ సపోర్ట్ స్కీం కింద పలువురికి సబ్సిడీ విడుదలై ఆరు నెలల నుంచి ఏడాది కావస్తున్నా ఇప్పటి వరకు గ్రౌండింగ్ కాలేదు. ఎస్సీలకు చేయూతను అందించేందుకు 60శాతం సబ్సిడీని ప్రభుత్వం అందిస్తోంది. బ్యాంక్‌కు సంబంధం లేకుండానే థర్డ్ పార్టీ పేరుతో సబ్సిడీలు 34 మంది పేర్ల మీద రూ.1.20కోట్లు విడుదల అయ్యాయి. అందులో 75శాతం పైగా యూనిట్‌లు గ్రౌండింగ్ కాలేదు. ఇది అధికారులకు తెలిసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.
ఇద్దరు కలిసి కాజేశారా?
అసలు సబ్సిడీ డబ్బులు లబ్ధిదారులకు అందయా?.. లేక గతంలో ఎస్సీ కార్పొరేషన్ అధికారి, కింగ్ బుక్‌స్టాల్ యజమాని ఇద్దరు కలిసి కాజేశారా అని అనుమానాలు రేకెత్తుతున్నాయి. రూ.1.20కోట్లు ఎటు వెళ్లాయని జిల్లా వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అధికారిక వెబ్‌సైట్‌లో గ్రౌండింగ్ కాలేదని తేటతెల్లం అవుతున్నా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటం గమనార్హం. లబ్ధిదారుల పేరుతో వీరిద్దరే సబ్సిడీ డబ్బులను మాయం చేశారని తెలుస్తోంది. దీని పై ఉన్నత స్థాయి అధికారి నియమించి క్షేత్రస్థాయిలో విచారణ చేపడితే ఆక్రమాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుందని దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
గోల్‌మాల్ పై జోరుగా చర్చ
ఎస్సీ కార్పొరేషన్‌లో సబ్సిడీ గోల్‌మాల్ అయ్యాయని వార్త ప్రచురితం కావడంతో జిల్లా వ్యాప్తంగా జోరుగా చర్చ సాగింది. పలు దళిత సంఘాలు ఎస్సీ కార్పొరేషన్ ఎండీకి, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్‌కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment