
ఇంజనీరింగ్ కళాశాల నిర్మాణానికి స్థల పరిశీలన
హుస్నాబాద్‌రూరల్: పట్టణంలో ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల నిర్మాణానికి గురువారం కలెక్టర్ మనుచౌదరి స్థలాన్ని పరిశీలించారు. శాతవాహన యూనివర్సిటీకి కొత్త ఇంజనీరింగ్ కళాశాల మంజూరు అయ్యింది. ఈ నేపథ్యంలో హుస్నాబాద్‌లో నిర్మించేందుకు వైస్ చాన్స్‌లర్ ఉమేష్‌కుమార్‌తో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ఉమ్మాపూర్ శివారులో మహాసముద్రం గండి వద్ద, జిల్లెలగడ్డలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల పక్కన ఉన్న ప్రభుత్వ భూములను పరిశీలించారు. కళాశాలకు త్వరగా ప్రభుత్వ భూమి గుర్తించి యూనివర్సిటీకి అప్పగించాలని కలెక్టర్ అధికారులను అదేశించారు. వీరి వెంట ఆర్డీఓ రామ్మూర్తి, తహసీల్దార్ రవీందర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment