
తూకాల్లో మోసం.. కొలతల్లో వ్యత్యాసం
సిద్దిపేటకమాన్/సిద్దిపేటజోన్/ప్రశాంత్‌నగర్: వినియోగదారులు నిత్యం నిలువు దోపిడీకి గురవుతున్నారు. కొన్ని వాణిజ్య, వ్యాపార సంస్థలు తూకాల్లోనే కాదు.. వివిధ రకాల మోసాలకూ పాల్పడుతున్నారు. నిబంధనలను తుంగలో తొక్కి రకరకాల తిరకాసులతో వినియోగదారులను నిండా ముంచుతున్నారు. సంబంధిత శాఖ అధికారులు పట్టించుకోకపోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. నిత్యం తనిఖీలు చేస్తూ కేసులు నమోదు చేసి, లైసెన్స్‌లు రద్దు చేయాల్సిన అధికారులు మొక్కుబడి చర్యలతో వదిలివేయడం వెనక పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బేకరీలు, సూపర్‌మార్కెట్లలో సైతం ప్యాకింగ్ ఆహార పదార్థాలు గడువు దాటినివి సైతం విక్రయిస్తున్నారు. పట్టణంలోని సుభాష్ రోడ్డు, ఓ గోదాంలో ప్యాకింగ్ లేకుండా విడిగా వంట నూనె, దీపం నూనెలు విక్రయిస్తూ నిర్వాహకులు డబ్బులు దండుకుంటున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. పట్టణంలో పండ్ల విక్రయదారుల మాత్రం ఇంకా పాత తరం త్రాసులే వాడుతుండటం గమనార్హం. వీటితోనే విక్రయదారులకు పండ్లు, పలు రాకాల పదార్థాలను తూకాలు వేస్తున్నారు.
రెండేళ్లలో 291 కేసులు
రెండేళ్లలో పలు దుకాణాల్లో తనిఖీలు నిర్వహించి 291 కేసులు నమోదు చేశారు. 2023–24లో 275 కేసులు నమోదు చేసి రూ.14,55,000 జరిమానా విధించారు. 2024–25లో 168 కేసులు నమోదు చేసి రూ.8,33,000 జరిమానా విధించి వసూలు చేశారు.
దర్జాగా దగా
వినియోగదారుల నిలువు దోపిడీ బస్టాండ్, థియేటర్ల దుకాణాల్లోఅధిక ధరలకు విక్రయాలు ఇప్పటికీ పాత తరం త్రాసులే వినియోగం పెట్రోల్ బంకుల్లోనూకనీస సౌకర్యాలు కరువు
చోద్యం చూస్తున్న సంబంధిత అధికారులు
నేడు ప్రపంచ వినియోగదారులహక్కుల దినోత్సవం
ఫిర్యాదు చేస్తే తనిఖీలు నిర్వహిస్తాం..
ఆహార పదార్థాలను నాణ్యతతోపాటు క్వాంటిటీలో తేడా రాకుండా విక్రయించాలి. గడువు ముగిసిన ఆహార పదార్థాలను, ఎంఆర్‌పీ కంటే ఎక్కువకు విక్రయించినా ఫిర్యాదు చేయండి. తనిఖీలు నిర్వహించి వారిపై చర్యలు తీసుకుంటాం. గత రెండేళ్లలో 291కేసులు నమోదు చేశాం. అలాగే పెట్రోల్ బంక్‌లలో పెట్రోల్, డీజిల్ కల్తీ చేపడితే చర్యలు చేపడతాం.
– సుజత్ అలీ,
తూనికల కొలతల జిల్లా ఇన్‌చార్జి అధికారి

తూకాల్లో మోసం.. కొలతల్లో వ్యత్యాసం

తూకాల్లో మోసం.. కొలతల్లో వ్యత్యాసం

తూకాల్లో మోసం.. కొలతల్లో వ్యత్యాసం

తూకాల్లో మోసం.. కొలతల్లో వ్యత్యాసం
Comments
Please login to add a commentAdd a comment