
ప్రగతి బాట.. రియల్ మాట
ట్రిపుల్ ఆర్ వరకు హెచ్‌ఎండీఏ విస్తరణ
● పుంజుకోనున్నరియల్ ఎస్టేట్ రంగం ● హెచ్‌ఎంఆర్ పరిధిలోకి75 రెవెన్యూ గ్రామాలు ● తగ్గనున్న సుడా విస్తీర్ణం
హెచ్‌ఎంఆర్ పరిధిలోకి వచ్చేరెవెన్యూ గ్రామాలు ఇవే..
● గజ్వేల్ : ఆక్కారం, బంగ్లా వెంకటాపూర్, థర్మారెడ్డిపల్లి గజ్వేల్, కొమటిబండ, క్యాసారం, మాసాన్‌పల్లి, ముట్రాజ్‌పల్లి, ప్రజ్ఞాపూర్, సంగాపూర్, శ్రీగిరిపల్లి.
● జగదేవ్‌పూర్: అల్లిరాజ్‌పేట్, ధర్మారం, ఇటిక్యాల, జగదేవ్‌పూర్, పీర్లపల్లి
● మర్కూక్: మండలంలో అంగడికిష్టాపూర్, చేబర్తి, దామరకుంట, ఎర్రవల్లి, కర్కపట్ల, మర్కూక్, పాములపర్తి, శివార్ వెంకటాపూర్. వర్ధరాజ్‌పూర్
● ములుగు: అచ్చాయపల్లి,అడివిమాజిద్, బలైంపూర్, బండ మైలారం, బండా తిమ్మాపూర్, బస్వాపూర్, క్షీరసాగర్, చిన్నా తిమ్మాపూర్, దాసర్లపల్లి, గంగాదారపల్లి, కొక్కొండ, కొత్తూరు, కోట్యాల, లక్ష్మక్కపల్లి, మామిడ్యాల, ములుగు, ముస్తఫగూడా, నర్సంపల్లి, నర్సాపూర్, జప్తి సింగాయపల్లి, సింగన్నగూడా, శ్రీరాంపూర్, తానెదార్‌పల్లి, తునికి బొల్లారం,
● రాయపోల్: అప్పాయిపల్లి, బేగంపేట్, ఎల్కల్
● వర్గల్: అంబర్‌పేట్, అనంతగిరిపల్లి, చందాపూరం, గౌరారం, జబ్బాపూర్, కొండాయిపల్లి, మాధారం, మైలారం, మజిద్‌పల్లి, మీనాజీపేట్, నాచారం, నెంటుర్, రామచంద్రపురం, శాఖారం, తునికి కల్స, తునికిమక్త, వర్గల్.
సాక్షి, సిద్దిపేట: ట్రిపుల్ ఆర్ (హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డు) వరకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ రీజియన్(హెచ్‌ఎంఆర్) ఏర్పాటుతో ప్రగతి పరుగులు పెట్టడంతోపాటు రియల్ ఎస్టేట్ రంగం పుంజుకోనుంది. మహానగర అభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ)ను విస్తరిస్తూ హెచ్‌ఎంఆర్‌గా ఏర్పాటు చేయడంతో దీని పరిధిలోకి 75 రెవెన్యూ గ్రామాలు రానున్నాయి. ఈ మేరకు పురపాలక ముఖ్యకార్యదర్శి ఎం. దానకిశోర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే మూడు మండలాలు హెచ్‌ఎండీఏ పరిధిలో ఉండగా మరో మూడు మండలాల్లోని గ్రామాలు హెచ్‌ఎంఆర్‌తో కలవనున్నాయి.
హెచ్‌ఎండీఏ విస్తరణతో హెచ్‌ఎంఆర్ పరిధిలో 11 జిల్లాలు, 104 మండలాలు ,1,355 రెవెన్యూ గ్రామాలు ఉండనున్నాయి. ట్రిపుల్ ఆర్ తరువాత 2 కిలో మీటర్ల వరకు ఉన్న ప్రాంతాన్ని బఫర్‌జోన్‌గా మార్చారు. హెచ్‌ఎండీఏ పరిధిలో ఇప్పటికే ములుగు మండలంలో 24 గ్రామాలు, మర్కూక్‌లోని 9గ్రామాలు, వర్గల్ 22 గ్రామాలు ఉన్నాయి. ప్రభుత్వ విడుదల చేసిన తాజా ఉత్తర్వులతో గజ్వేల్‌లోని 12, జగదేవ్‌పూర్‌లోని 5, రాయపోల్‌లోని మూడు గ్రామాలు చేరాయి. ఇలా మొత్తంగా జిల్లాలోని 75గ్రామాలు హెచ్‌ఎంఆర్ పరిధిలోకి వస్తున్నాయి. అభివృద్ధి సైతం వేగిరం కానుంది.
పెరగనున్న భూముల ధరలు
హెచ్‌ఎంఆర్ పరిధిలోని గ్రామాల్లో భూముల ధరలు అమాంతం పెరగనున్నాయి. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రియల్ ఎస్టేట్ రంగం మళ్లీ పుంజుకోనుంది. ట్రిపుల్ ఆర్ కు సమీపంలో ఉండనుండటంతో భూములకు మంచి డిమాండ్ రానుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారులు భూములకొనుగోళ్లపై దృష్టి పెట్టారు. అలాగే హైదరాబాద్‌లో ఉండే వారు సైతం హెచ్‌ఎంఆర్ పరిధిలో భూము లు కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు.
తగ్గనున్న సుడా పరిధి
గతేడాది అక్టోబర్‌లో సుడా (సిద్దిపేట అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ) ను జిల్లా వ్యాప్తంగా విస్తరించారు. అందులో భాగంగా జగదేవ్‌పూర్, గజ్వేల్, రాయపోల్ మండలాల్లోని పలు రెవెన్యూ గ్రామాలు సైతం హెచ్‌ఎంఆర్‌లో కలువనున్నాయి. దీంతో సుడా విస్తీర్ణం తగ్గనుంది. సుడాకు సంబంధించి మళ్లీ కొత్త ఉత్తర్వులు ఏమైన విడుదల చేస్తారా లేదా చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment