
ఆక్రమణలపై చర్యలు తీసుకోండి
శనివారం శ్రీ 15 శ్రీ మార్చి శ్రీ 2025
మంత్రి కొండా సురేఖకు ఫిర్యాదు
హుస్నాబాద్: ఎల్లమ్మ గుడి వద్ద ప్రైవేట్ భూమిని కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపడుతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చిత్ర దర్శకుడు, తెలంగాణ ఉద్యమకారుడు సయ్యద్ రఫీ శుక్రవారం నగరంలో మంత్రి కొండా సురేఖకు ఫిర్యాదు చేశారు. హుస్నాబాద్‌లోని తన 4.4 ఎకరాల భూమిని ఎల్లమ్మ గుడికి దానం చేశారు. ప్రస్తుతం దాని విలువ సుమారు రూ.32.80 కోట్లు ఉందన్నారు. దాని పక్కనే ఉత్తరం వైపు ఉన్న 32 గుంటలన్నర మా సొంత భూమిని ఎల్లమ్మ గుడి ఈఓ మరికొందరు కలిసి కబ్జా చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయంపై మున్సిపల్ కమిషనర్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఆక్రమణదారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మంత్రికి ఫిర్యాదు చేశారు.
సిద్దిపేటలో డ్రమ్ వాయిస్తున్న మున్సిపల్ చైర్‌పర్సన్ మంజుల

ఆక్రమణలపై చర్యలు తీసుకోండి
Comments
Please login to add a commentAdd a comment